పేజీని తొలగించినందుకు క్షమాపణలు చెప్పిన ఫేస్‌బుక్

by  |
Ville de Bitche
X

దిశ, ఫీచర్స్ : కొన్ని గ్రామాల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్క అక్షరం అటు, ఇటైనా పూర్తిగా వాటి అర్థమే మారిపోతుంది. ఇటీవలే జడ్చర్లలోని ‘వల్లభురావ్ పల్లి’ పేరును ‘వలపురావ్ పల్లి’గా, ‘వడ్యాల’‌ను ‘వడియాల్’‌గా మార్చడంతో స్థానికులు ఆగ్రహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్‌లోని ఓ పట్టణానికి ‘బిచ్’ అనే పేరుండటం శాపంగా మారింది. అల్గారిథం సమస్య కారణంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ నుంచి ఆ గ్రామానికి సంబంధించిన పేజీని తొలగించారు. దీంతో ఆగ్రహించిన ఆ గ్రామస్థులు.. తమ సిటీ పేజీని ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే ఎఫ్‌బీ ఆ పేజీని రిస్టోర్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పింది.

French town

ఫేస్‌బుక్ నిబంధనల ప్రకారం పేజీ పేర్లు ఖచ్చితంగా ఉండాలి, అవి అసంబద్ధ పద బంధాల(అబ్యూసివ్)ను కలిగి ఉండకూడదు. ఇక ప్రస్తుత ఇష్యూకు సంబంధించి, అల్గారిథమ్ వల్ల ఇలా జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు మార్చి 19న పేజీని తొలిగించామని వెల్లడించిన ఎఫ్‌బీ.. విషయం తమ దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే ఏప్రిల్ 13న బిచ్ సిటీ పేజీని పునరుద్ధించామని తెలిపింది. కాగా తమ సిటీ పేరుతో పేజీని సృష్టించాలనుకున్నప్పుడు ఇదే విధమైన సమస్య ఏర్పడిందని స్థానిక యువకుడు వలరీ తెలిపాడు. తాను బిచ్ అనే పదాన్ని నమోదు చేయలేకపోయానని.. దాంతో ‘విల్లే ఫోర్టిఫై’ అనే పేరుతో పేజీని రూపొందించి, డిస్క్రిప్షన్‌లో బిచ్ సిటీ అధికారిక పేజీ అని తెలిపానని వివరించాడు.

Bitche

ఫేస్‌బుక్ పేజీ.. ‘విల్లే డి బిచ్ (సిటీ ఆఫ్ బిచ్)’ ఇకపై ఆన్‌లైన్‌లో ఉండదని, ఈ ఊరి పేరు ఫేస్‌బుక్ పేజీలకు వర్తించే షరతులను ఉల్లంఘిస్తోందని మార్చి 19న ఎఫ్‌బీ తెలియజేసింది. మా పట్టణం పేరు చెడు వ్యాఖ్యానంతో ఉన్నట్లు అనిపించింది. కానీ ఫ్రెంచ్ ఎఫ్‌బీ ప్రెసిడెంట్ తనను మంగళవారం సంప్రదించి, పేజీని తిరిగి పునరుద్ధరిస్తున్నామన్నాడు. ఈ అసౌకర్యానికి మా పట్టణ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు
– బెనోయట్ కీఫెర్, పట్టణ మేయర్



Next Story

Most Viewed