ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ యజమాని అరాచకం.. రైతుపై గొడ్డలితో దాడి

by  |
FARMER-GANESH
X

దిశ, బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన రైతు మాడోత్ గణేష్ అనే వ్యక్తిపై సాల్వో ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ వాచ్‌మెన్ గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీ యజమాని ఆయిలేని జయరాం రెడ్డి గత ఆరేండ్ల క్రితం రైతు గణేష్‌కు చెందిన తొమ్మిది ఎకరాలలో నాలుగు ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశాడు. అప్పటికే ఆ భూమిలో రైతు గణేష్ హద్దురాళ్లు పెట్టాడు. ఈ క్రమంలో మెల్ల మెల్లగా మిగిలిన రైతు భూమి కబ్జా చేయడానికి కంపెనీ యాజమాన్యం చూసింది.

ఇందులో భాగంగానే శుక్రవారం కొంతమేర భూమిని కబ్జా చేసి కంచె వేయడం ప్రారంభించారు. ఇదేంటని రైతు నిలదీయగా, మాటామాటా పెరిగింది. గణేష్ భార్యను వాచ్‌మెట్ నల్ల నర్సింహా దర్భాషలాడారు. దీంతో మాటలు ముదిరి ఘర్షణ జరిగింది. దీంతో వాచ్‌మెన్ నర్సింహా, ఆయన తనయుడు మహేందర్, కంపెనీ యజమాని అనుచరులతో రైతు గణేష్‌పై గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో రైతు గణేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, అంతకుముందే కంపెనీ తన భూమిని కబ్జా చేయాలని చూస్తోందని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

కాగా, పారిశ్రామిక వేత్త జయరాం రెడ్డి రాజకీయ నాయకుల అండదండలతోనే రైతులను బాధలు పెట్టి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమ భూమిని పారిశ్రామిక వేత్త చెరనుండి విడిపించాలని ప్రభుత్వాన్ని బాధిత రైతు గణేష్ వేడుకొంటున్నారు. ఘర్షణ విషయం తెలిసిన ఎస్ఐ వెంకన్న బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఇదే విషయమై పారిశ్రామిక వేత్త జయరాం రెడ్డిని సంప్రదించగా, తనకేమీ తెలియదు. నాకేమి సంభంధం లేదంటూ కాల్ కట్ చేసినట్లు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed