కొండ చరియలు విరిగిపడిన ప్రాంతం పరిశీలన

by  |
కొండ చరియలు విరిగిపడిన ప్రాంతం పరిశీలన
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని శుక్రవారం నిపుణుల కమిటీ పరిశీలించింది. ఓంకారం మలుపు, మౌనముని గుడివద్ద ఇంకా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని జియో ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుడు త్రిమూర్తిరాజు తెలిపారు. కొండలు, మట్టి, రాళ్లు కలిసి ఉన్నాయని, వర్షాల ప్రభావంతో జారీ పడుతున్నాయన్నారు. ప్రమాదాలను అరికట్టే విధంగా అలారం ఏర్పాటు, ఐరెన్ మెష్ మరింత పటిష్టం చేసి, వదులుగా ఉన్న కొండ చరియలను తొలగించాలని పేర్కొన్నారు. వారంరోజుల్లో నివేదిక ఇస్తామని వెల్లడించారు. అటు.. ఇవాళ ఇంద్రాకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి.. కొండచరియలు విరిగిపడిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి.. తక్షణమే నిధులను విడుదల చేయడం మంచి నిర్ణయమన్నారు.



Next Story

Most Viewed