మాజీ సైనికుడుకి లింక్ పంపి.. రూ. 2.30 లక్షలు మాయం చేసిన సైబర్ దొంగలు

by  |
cyber-fraud1
X

దిశ, మహబూబాబాద్ టౌన్: సైబర్ మోసగాళ్ల మాటల్లో పడి ఓ మాజీ సైనికుడు రూ. 2 లక్షల 30 వేలు పోగొట్టుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని సిగ్నల్ కాలనీకి చెందిన భిక్షపతి అనే మాజీ సైనికుడు ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం 2 లక్షల 30 వేల రూపాయలు అప్పుగా తీసుకొని ఎస్.బి.ఐ ,హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ లలో డిపాజిట్ చేసుకున్నాడు. అవసరం అయినప్పుడు బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకునేందుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆన్ లైన్ లో చెక్ బుక్ ల కోసం అప్లై చేసుకున్నాడు. వెంటనే అవతలి వైపు నుండి ఓ ఫోన్ వచ్చింది. మీరు చెక్ బుక్ కోసం అప్లై చేసుకున్నారు. ఓ లింక్ ను పంపిస్తున్నాను.. దానిని ఓపెన్ చేయండి అని చెప్పాడు. వెంటనే భిక్షపతి ఆ లింక్ ను ఓపెన్ చేశాడు. ఈ విధంగా 5 సార్లు లింక్ ను ఓపెన్ చేపించి 2 లక్షల 30 వేల రూపాయలను కేటుగాళ్లు కాజేశారు. కొద్దిసేపటి తరువాత బాంక్ అకౌంట్ ల నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు వెంటనే బ్యాంక్ అధికారులకు, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story

Most Viewed