EVDM బ్యాక్.. టీఆర్ఎస్ నాయకులకు భారీగా చలాన్లు

by  |
EVDm
X

దిశ, డైనమిక్ బ్యూరో : సాంకేతిక సమస్యలు, సైట్ మెయింటనెన్స్ పేరుతో అక్టోబర్ 21 నుంచి ఈవీడీఎం వెబ్‌సైట్ పనిచేయని విషయం తెలిసిందే. దీనిపై నెట్టింట తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ మొత్తాన్ని ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయం చేశారు. దీంతో నగరవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఈవీడీఎం డైరెక్టర్‌ను ప్రశ్నించారు. అంతేకాకుండా వ్యాపార సంస్థలు, ఇతర పార్టీ నాయకుల ఫ్లెక్సీలపై భారీగా జరిమానాలు విధించే EVDM.. టీఆర్ఎస్ ప్లీనరీ అనగానే వెబ్ సైట్ పనిచేయదా అంటూ మండిపడ్డారు.

ఇలా ఎవరికి వారు నెట్టింట EVDM కు ట్యాగ్ చేస్తూ వందల ఫిర్యాదులు చేశారు. అయితే, EVDM వెబ్‌సైట్ గురువారం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా అక్టోబర్ 21 నుంచి వచ్చిన ఫిర్యాదులను వెలికితీస్తోంది. ఈ క్రమంలో ఖైరాతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలు అధికంగా ఏర్పాటు చేశారు.

దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు EVDM భారీగా జరిమానాలు విధిస్తోంది. ఆయనతోపాటు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులకు సైతం ఒక్కొక్కటిగా వెరిఫై చేస్తూ జరిమానాలు వేస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. వెల్కమ్ బ్యాక్ EVDM అంటూ ట్వీట్లు చేస్తున్నారు. రూల్స్‌కు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలకు ఫైన్లు వేయాలని కామెంట్లు చేస్తున్నారు.

Next Story