కేసీఆర్ VS ఈటల : హుజురాబాద్‌లో ఎవరి బలమెంత..?

by  |
TRS, Etela Rajender, cm kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఇన్నిరోజులు నియోజకవర్గ నేతలతో షామీర్ పేటలోని తన ఫామ్‌హౌజ్ నుంచి మంతనాలు జరిపిన ఈటల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మరుసటి రోజే తన శాసనసభ సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్తారని అంతా భావించారు. చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలీదు కానీ ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు.

ఇప్పటికే నియోజకవర్గంలో చాలా మంది అనుచరులు ఈటలను కాదని టీఆర్ఎస్‌తోనే ఉంటామని ప్రకటించారు. అందుకు గులాబీ మంత్రుల మంతనాలు ఫలించినట్లు తెలుస్తోంది. మిగతా నేతలు, నియోజకవర్గ ప్రజలను గులాబీ నేతలు తప్పుదారి పట్టించకుండా ఉండేందుకు నేరుగా ఈటల రంగంలోకి దిగినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో ఈటల బలప్రదర్శనకు దిగారు. మంగళవారం శంభునిపల్లి టు కమలాపూర్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. మూడు గ్రామాల్లో ఈటల పర్యటన కొనసాగుతుండగా ప్రజలు నుంచి ఆదరణ ఎలా ఉంటుందనేది వేచిచూడాలి. అయితే, ఎమ్మెల్యే హోదాలో ఈటల నియోజకవర్గంలో చేస్తున్న చివరి పర్యటనగా ఇదే కావచ్చునని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, కొవిడ్ సమయంలో ఈటల రోడ్ షోపై పోలీసులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.


Next Story