వైరల్ అయిన స్క్రీన్ షాట్స్… ఈటలకు ఊహించని షాక్

by  |
వైరల్ అయిన స్క్రీన్ షాట్స్… ఈటలకు ఊహించని షాక్
X

దిశ, గోదావరిఖని: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది వాట్సాప్ చాటింగ్ లో దళితులను అసభ్య పదజాలంతో దూషించారంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరి పులేందర్ ఆధ్వర్యంలో దళిత ద్రోహి ఈటెల రాజేందర్ అంటూ దళిత నేతలు ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీఆర్ఎస్ దళిత నాయకులు ఆందోళన చేపట్టారు.

దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న దళితబంధు పథకాన్ని అవహేళన చేస్తూ దళితులను కించపరిచేలా అసత్య పదజాలంతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులు కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా ఉంటారని మేయర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభిషేక రావు, పాతిపెళ్లి ఎల్లయ్య బొడ్డు రవీందర్, JV రాజు, కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్, మేకల సదానందం, యాదవ్ కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తాటిపర్తి గోపాల్ రావు, అచ్చ వేణు కల్వల శ్రీనివాస్, పొన్నం లక్ష్మణ్ గౌడ్, జలపతి వేణు, తోకల రమేష్, వంశీకృష్ణ, నేరడి శ్రీనివాస్, 28 వ డివిజన్ ప్రెసిడెంట్ కొండ సురేష్, డివిజన్ జనరల్ సెక్రెటరీ జక్కుల ప్రేమ్ కుమార్, పల్లె సాంబయ్య, భూపేంద్ర శంకర్, ప్రభాకర్, రాకేష్, సతీష్, సదానందం, రమేష్, సుమన్, ఇరుగురాళ్ల శ్రావన్, మేకల అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed