తెలంగాణ రాష్ట్ర అతిథి అధ్యాపకుల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు

by  |
jac
X

దిశ, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీ, వివిధ గురుకుల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, TREIS, మోడల్ స్కూల్) సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో దాదాపు 10 వేల మంది అతిధి(గెస్ట్) అధ్యపకులుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కోర్టు, యూజీసీ సూచనల మేరకు ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా కొన్ని సొసైటీలు వ్రాత పరీక్ష ద్వారా గెస్ట్ లెక్చరర్ లను నియమించుకోవడం జరిగింది. కానీ అధికారులు సమన్వయ లోపం కారణంగా వారిని విద్యాసంవత్సరం మధ్యలో తొలగించారు. ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూ చేసిన వారికి మళ్ళీ ఇంటర్వూ నిర్వహించడం, పనిచేసిన కాలానికి జీతాలు సరైన సమయంలో చెల్లించలేదు. నెలసరి వేతనం లేకపోవడం, చేస్తున్న పని ఒకటే కానీ వివిధ సొసైటీల మధ్య జీతాల వ్యత్యాసాలు ఉన్నాయి.

పీరియడ్ కు 100 రూపాయలు ఉన్న జీతాన్ని 300 రూపాయలు చేసినా ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను తీసుకు వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో వివిధ విద్యాసంస్థలలో పని చేస్తున్న అతిధి అధ్యాపకుల సంఘాలు (ప్రభుత్వ జూనియర్, డిగ్రీ,ST, TREIS, గురుకుల మరియు మోడల్ స్కూల్ సొసైటీ) అన్ని ఒక తాటికి పై వచ్చి తెలంగాణ రాష్ట్ర అతిధి అధ్యాపకుల ఐక్య కార్యాచరణ సమితి ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈజేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా బైరగొని ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గన్నోజు రామ్మోహన్, ఉపాధ్యక్షుడిగా.యాకుబ్ పాషా, దామెరా ప్రభాకర్, గంగాల నరేష్, జి. శ్రీనివాస్, పల్లె అనిల్ కుమార్, స్వరూప, K. ఐలయ్య, మీడియా ప్రతినిధులుగా అయిల్ సదానందం గౌడ్, కె. దేవేందర్, సీహెచ్. వెంకటేశం, మహిళా కార్యదర్శులుగా నవమని, ప్రభావతి సంయుక్త కార్యదర్శి లుగా ఎన్నికయ్యారు.

Next Story