చినుకు పడితే మమ్ముల్ని సంప్రదించండి

by  |
చినుకు పడితే మమ్ముల్ని సంప్రదించండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో మూడు రోజులు వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. చేపల వేట నిషేధించినందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రతపై మంత్రి అనిల్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. రాష్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. అధికారులు ప్రకటించిన టోల్ ఫ్రీనంబర్లు ఇలా ఉన్నాయి. ఏలూరు కలెక్టరేట్ 18002 331077, ఏలూరు ఆర్డీవో ఆఫీస్ 08812 232044, నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ 08814 276699, కొవ్వూరు ఆర్డీవో ఆఫీస్ 08813 231488, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీస్ 08821 223660, కుక్కునూరు ఆర్డీవో ఆఫీస్ 08821 232222, నరసాపురం తహసీల్దార్ ఆఫీస్ 08814 275048, మొగల్తూరు తహసీల్దార్ ఆఫీస్ 98669 51235 నంబర్లను తుఫాన్ బారిన పడిన బాధితులు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed