రెండు రెట్లు పెరిగిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు!

by  |
Mutual Funds
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లతో పాటు ఎస్ఐపీ పెట్టుబడుల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు పెరిగాయి. జూలై-సెప్టెంబర్ మధ్య దాదాపు రూ. 40,000 కోట్ల పెట్టుబడులు ఈ విభాగంలోకి వచ్చాయని, ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే రెండు రెట్లు అధికమని తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) మొత్తం ఆస్తుల విలువ సెప్టెంబర్ చివరి నాటికి రూ. 12.8 లక్షల కోట్లకు చేరుకుందని, జూన్ చివరి నాటికి ఇది రూ. 11.1 లక్షల కోట్లుగా ఉండేదని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాలు పేర్కొన్నాయి.

ఈ గణాంకాల ప్రకారం.. మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చిన పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో రూ. 19,508 కోట్లతో పోలిస్తే సెప్టెంబర్‌లో రూ. 39,927 కోట్లకు పెరగడం గమనార్హం. ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతో పాటు వ్యాపారాలు మెరుగుపడటం, లిక్విడిటీ, ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మ్యూచువల్ ఫండ్లలో స్థిరమైన పెట్టుబడులు నమోదయ్యాయి. ప్రధానంగా కొత్త ఫండ్ ఆఫర్లతో పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్ఐపీ) విభాగాలు పెట్టుబడులకు మద్దతిచ్చాయి.

Next Story

Most Viewed