ఇంగ్లండ్ జట్టు ఇండియా పర్యటన వాయిదా?

by  |
ఇంగ్లండ్ జట్టు ఇండియా పర్యటన వాయిదా?
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి దెబ్బకు మరో ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యటన జరిగే అవకాశాలు లేవని, వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేయనున్నట్లు బీసీసీఐలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2020-21 సీజన్‌కుగాను తొలి స్వదేశీ సిరీస్‌లో భాగంగా 3 వన్డేలు, 3 టీ20లు ఇంగ్లండ్ జట్టుతో ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ నిర్ణీత సమయంలో జరపడం కష్టమని వాయిదా వేసినట్లు సమాచారం. ఈనెల 17న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది స్వదేశంలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లు ఒక్కటి కూడా లేకుండా పోయాయి. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు 5 టెస్టులు ఆడటానికి ఇండియాకు రానున్నది. అప్పుడే ఈ వాయిదా పడిన మ్యాచ్‌లు కూడా ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నది. మరోవైపు పర్యటన వాయిదా పడటం వల్ల స్టార్ ఇండియాకు కూడా భారీ నష్టమే వాటిల్లనుంది. టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ వాయిదా వేస్తుండటంతో ఈ ఏడాది ఇండియాలో అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు లేకుండా పోవడం స్టార్ ఇండియాకు రెవెన్యూ పరంగా పెద్ద లోటు. బీసీసీఐ కూడా ఐపీఎల్ నిర్వహించకపోతే రూ.4 ల కోట్ల వరకు ఆదాయం కోల్పోవలసి వస్తుంది.

Next Story