ఒలంపిక్స్ రేసు నుంచి సుశీల్ కుమార్ ఔట్

by  |
ఒలంపిక్స్ రేసు నుంచి సుశీల్ కుమార్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ టోక్యో ఒలంపిక్స్ రేసు నుంచి నిష్క్రమించాడు. ప్రపంచ ఒలంపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు వెళ్లే భారత బృందం నుంచి సందీప్ మన్‌ను తప్పించి అతడి స్థానంలో అమిత్ ధన్‌కర్ (74 కేజీలు)ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో అదే కేటగిరీలో పోటీ పడుతున్న సుశీల్ కుమార్ క్వాలిఫయింగ్ పోటీల నుంచి తప్పుకోవల్సి వచ్చింది. మే 6 నుంచి 9 వరకు బల్గేరియాలో ఈ పోటీల్లో అర్హత సాధించిన వారికి టోక్యో బెర్త్ లభిస్తున్నది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎంపికను ఖరారు చేసింది. కాగా, 2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలంపిక్స్‌లో వెండి పతకం సాధించిన సుశీల్ కుమార్‌కు టోక్యో ఒలంపిక్స్ బెర్త్ దక్కకపోవడం రెజ్లింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సుశీల్ స్పందిస్తూ ‘ఈ సమయంలో బతకి ఉండటమే చాలా ముఖ్యమైన విషయం. ఇక నేను ఎంపిక కాకపోవడంపై రెజ్లింగ్ ఫెడరేషన్ నాతో ఇంకేమీ మాట్లాడలేదు. నేను వారితో త్వరలో మాట్లాడతాను’ అని సుశీల్ అన్నాడు.

Next Story

Most Viewed