ఆ బ్యాంకు ఉద్యోగులకు షాక్.. వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం

by  |
bank
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కట్టడికి చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్ కూడా నిలివేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, కొన్ని చోట్లకు ప్రయాణించాలంటే.. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు.

ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధన తీసుకొచ్చింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి డిసెంబర్ నెల జీతాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. మెడికల్ సర్టిఫికేట్ తో పాటు వ్యాక్సిన్ వేసుకోనందుకు గల కారణాల గురించి అధికారులకు లెటర్ ఇవ్వాలని ప్రకటనలో తెలిపింది.

1244

Next Story

Most Viewed