పంది మెదడులో చిప్.. నరాల వ్యాధులు నయం

by  |
పంది మెదడులో చిప్.. నరాల వ్యాధులు నయం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్.. ‘జెర్‌ట్రూడ్’ అనే పంది మెదడులో నాణెం సైజులో ఉన్న ఓ కంప్యూటర్ చిప్‌ను అమర్చింది. ఈ చిప్ నాడీ చర్యలను సూచిస్తూ వైర్‌లెస్ సంకేతాలను పంపిస్తుంది. అయితే, మనిషి మెదడులోనూ ఇలాంటి చిప్ పెట్టడం వల్ల.. డిమెన్షియా, పార్కిన్సన్ వంటి వ్యాధులను నయం చేయవచ్చని న్యూరాలింక్ నిర్వాహకులు చెబుతుండటం విశేషం.

టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థలు సంయుక్తంగా ‘న్యూరాలింక్’ అనే స్టార్టప్‌ను 2016లో ప్రారంభించారు. మిషన్ ఇంటర్‌ఫేస్‌తో మెదడును రూపొందించాలన్నది తమ న్యూరాలింక్ ఆలోచన అని మస్క్ వెల్లడించారు. ఇలాంటి ఇంటర్‌ఫేస్ సహాయంతో మెదడు నేరుగా ఫోన్లను, కంప్యూటర్లను నియంత్రించే వీలు కలుగుతుంది. అంతేకాదు, నరాలకు సంబంధించిన వ్యాధులను నయం చేయడంలోనూ ఇది తోడ్పడుతుంది. స్పైనల్ కార్డ్ ఇంజూరీస్‌తో పాటు మెమొరీ లాస్, హియరింగ్ లాస్, డిప్రెషన్, ఇన్‌సోమ్నియా వంటి ప్రాబ్లమ్స్‌ను కూడా దీనిద్వారా సరిచేయవచ్చు. ప్రస్తుతం పంది మెదడులో ఈ చిప్‌ను అమర్చి పరిశోధనలు చేస్తున్నారు. కాగా, ఇది విజయవంతమైతే.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో హ్యుమన్ ట్రయల్స్ కూడా పూర్తి చేస్తామని మస్క్ స్పష్టం చేశారు. హ్యుమన్ ట్రయల్స్‌లో భాగంగా.. పెరాలసిస్ పేషెంట్లలో దీన్ని అమర్చుతామని తెలిపాడు. మరికొన్నాళ్ల పాటు ఈ ప్రయోగాలను చేయనున్నారు. న్యూరాలింక్ చిప్ 23 మిల్లిమీటర్లు (0.9 ఇంచులు) పరిమాణంలో ఉంటుంది. ‘నా మెదడులో కూడా న్యూరాలింక్ ఉంది.. కానీ ఆ విషయం మీకు తెలియదు’ అంటూ మస్క్ తెలపడం గమనార్హం.

Next Story

Most Viewed