ఆర్టీసీ కోఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి: రాజిరెడ్డి

63

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఆర్టీసీ కో ఆపరేటివ్ క్రెడిట్ పాలక మండలి గడువు ముగిసినందున ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి కోరారు. శుక్రవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతి 5 ఏళ్లకు కొకసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీ అని, డెలిగేట్స్ ఎన్నికలను 2016 నవంబర్ 23న నిర్వహించారని తెలిపారు. పాలకమండలి పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా సీసీఎస్ సెక్రటరీని ఆదేశించాలని కోరారు. డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు.