నల్గొండలో ఉడకని గుడ్లు.. చెత్త పాలైన మధ్యాహ్న భోజనం

by  |
నల్గొండలో ఉడకని గుడ్లు.. చెత్త పాలైన మధ్యాహ్న భోజనం
X

దిశ, చిట్యాల : మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పెట్టిన కోడిగుడ్లు ఉడకక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఈరోజు ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు వడ్డించిన కోడిగుడ్లు సరిగ్గా ఉడకలేదు. దీంతో విద్యార్థులు ఒక్కరు కూడా గుడ్లను తినకుండా చెత్తబుట్టలో వేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిత్యం పరిశీలించి విద్యార్థులకు పెట్టాల్సి ఉంది.

అంతేకాకుండా విద్యార్థులతో పాటు ఆ పాఠశాలకు చెందిన ఒకరిద్దరు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని తినాల్సి ఉంటుంది. అయితే, మధ్యాహ్న భోజనంపై పరిశీలన పాఠశాలలో సక్రమంగా అమలు జరగడం లేదని తాజా ఘటనను బట్టి తేటతెల్లమవుతుంది. విద్యార్థులు ఉడకని గుడ్లను పడవేయడంతో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పోలేపల్లి సత్యనారాయణ స్పందించి సంబంధిత మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులను అడుగగా కొత్త గుడ్లు సరిగా ఉడకవని ఇలాగే అవుతాయని బదులిచ్చారని తెలిసింది. దీంతో ఆయన పాఠశాల ఉపాధ్యాయులు మరియు మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed