రైతు వేదికల ద్వారా చైత‌న్య‌వంతులు కావాలి: ఈటల

by  |
రైతు వేదికల ద్వారా చైత‌న్య‌వంతులు కావాలి: ఈటల
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన చ‌ట్టాల‌తో రైతుల‌కు న‌ష్ట‌మే చేకూరుతుంద‌ని మంత్రి ఈటల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అధ్య‌య‌నం కోసం ఏర్పాటు చేసిన నిపుణుల నివేదిక‌ల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. రైతాంగం ఉద్య‌మం చేస్తున్న‌ది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్ రైతులే కావ‌చ్చ‌ని, దేశంలోని రైతు పోరాట‌ల‌కు కులం, మ‌తం అనేవి ఉండ‌వ‌ని అన్నారు. గ‌త మూడు రోజ‌లుగా రైతు ఉద్య‌మానికి త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్న మంత్రి ఈట‌ల గురువారం కూడా కొన‌సాగించారు. వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా మంత్రి స్వ‌గ్రామం క‌మ‌లాపూర్ మండ‌ల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ… 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 70 శాతం మంది వ్య‌వ‌సాయంపైనే ఆధార‌ప‌డ్డార‌ని గుర్తు చేశారు. వ్య‌వ‌సాయం, రైతు బాగుంటేనే దేశం బాగుటుంద‌ని అన్నారు. తన పంటకు ధర నిర్ణయించుకోవాలంటే రైతులు సంఘటితం కావాలని అన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రతి క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదిక‌లే కేంద్రాలుగా మారాల‌ని ఆకాంక్షించారు. రైతులు తాము పండించిన పంటలకు ధరల‌ నిర్ధారణ, పంట ఉత్పత్తి పెంచుకోవ‌డానికి తీసుకోవాల్సిన విధివిధానాలు రైతులందరూ చర్చించి నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చ‌న్నారు.



Next Story

Most Viewed