CITD హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు..

by Disha Web Desk 13 |
CITD హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు..
X

దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్ బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), 2023 - 24 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఈ డిప్లొమా కోర్సులు చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సు..సీట్లు:

డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మోల్డ్ మేకింగ్ (డీటీడీఎం) - 60

డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (డీఈసీఈ) - 60

డిప్లొమా ఇన్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ (డీపీఈ) - 60 సీట్లు

వ్యవధి: డీటీడీఎం కోర్సుకు నాలుగేళ్ల మిగిలిన కోర్సులకు మూడేళ్లు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: మే 21/2023 నాటికి 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అబ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు.

అప్లికేషన్ ఫీజు: జనరల్ కేటగిరి వారికి రూ. 700. ఎస్సీ/ఎస్టీలకు రూ. 350.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరితేది: మే 13, 2023.

ఎంట్రన్స్ పరీక్ష తేదీ: మే 21, 2023.

పరీక్షా కేంద్రం: హైదరాబాద్ లో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: https://citdindia.org

ఇవి కూడా చదవండి:

ఆ కాలేజీలో డిగ్రీతో పాటు ఉచితంగా హాస్టల్.. ఫ్రీ ట్రైనింగ్



Next Story

Most Viewed