టెట్ దరఖాస్తుకు మరో అవకాశం కల్పించాలి

by Disha edit |
టెట్ దరఖాస్తుకు మరో అవకాశం కల్పించాలి
X

టెట్‌కు వెయిటేజీ ఇవ్వడం కాకుండా, అర్హత పరీక్షలాగా నిర్వహిస్తే సరిపోతుంది. టెట్‌కు డీఎస్‌సీలో వెయిటేజీ ఇవ్వడంతో అభ్యర్థులు ప్రతిసారీ మార్కులు పెంచుకోవాలని పరీక్ష రాస్తున్నారు. ఇది డబ్బులు వసూలు చేసే మార్గంలా ఉందని చాలా మంది విద్యావేత్తలు అంటున్నారు. ఈ సారి టెట్ రాసే అభ్యర్థుల నుండి సుమారుగా రూ.19 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలలో వెయిటేజీ లేకుండా కేవలం అర్హత పరీక్షలాగా నిర్వహిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో టెట్, డిఎస్‌సీ కలిపి నిర్వహిస్తున్నారు. గతంలో ఎస్‌జీ‌టీ పోస్టులలో బీఈడీ పూర్తి చేసినవారికి అవకాశం కల్పించలేదు. ఈ సారి అవకాశం కల్పించారు. దీనితో బీఈడీ విద్యార్థులు టెట్ పేపర్ 1 కూడా అధిక సంఖ్యలో అప్లయి చేసుకొన్నారు.

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుకు మరో అవకాశం కల్పించాలని, ఎడిట్ చేసుకొనే వెసులుబాటు ఇవ్వాలని వారం రోజుల నుంచి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. టెట్‌కు మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తు చేసుకోవడానికి 16 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. నెట్ వర్క్, సర్వర్ డౌన్, అందుబాటులో లేని ఇంటర్‌నెట్ సేవలు, టెక్నికల్ సమస్యలతో దాదాపు లక్ష మంది అభ్యర్థులు అప్లయి చేసుకోలేకపోయారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలవారే అధికంగా ఉన్నారు. టెట్ పేపర్ వన్‌కు 3,51,468 మంది, పేపర్ టుకు 2,77,884 మంది. మొత్తం 6,29,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఏటా రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్‌సీ‌టీ‌ఈ నిబంధనలు చెబుతున్నాయి. వాటిని తుంగలో తొక్కుతూ గత ఐదు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో టెట్ నిర్వహించలేదు. రెగ్యులర్‌గా టెట్ పెడితే ఇంత మంది నిరీక్షణలో ఉండేవారు కాదు. ఈసారి బీఈడీ పూర్తి చేసినవారికి కూడా ఎస్‌జీ‌టీ పోస్టులకు ఎలిజిబిలిటీ కల్పించారు. దీనితో అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ అంచనా టెట్ నిర్వాహకులలో కొరవడింది. అందుకే భారీగా వస్తున్న అప్లికేషన్‌లను నివారించడానికి లోకల్ సెంటర్స్ లేకుండా హైదరాబాద్ చుట్టుపక్కల సెంటర్స్ బ్లాక్‌లో పెట్టారు. లోకల్ సెంటర్స్ అవకాశం కోసం అభ్యర్థులు చివరి రోజు వరకు ఎదురు చూశారు. అధికారుల నుంచి స్పందన కరువైంది. అర్హత పరీక్షల దరఖాస్తులలో ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించడం సర్వసాధారణమే అయినా దానిని విస్మరించారు.

హేతుబద్దత ఏదీ?

టెట్‌కు వెయిటేజీ ఇవ్వడం కాకుండా, అర్హత పరీక్షలాగా నిర్వహిస్తే సరిపోతుంది. టెట్‌కు డీఎస్‌సీలో వెయిటేజీ ఇవ్వడంతో అభ్యర్థులు ప్రతిసారీ మార్కులు పెంచుకోవాలని పరీక్ష రాస్తున్నారు. ఇది డబ్బులు వసూలు చేసే మార్గంలా ఉందని చాలా మంది విద్యావేత్తలు అంటున్నారు. ఈ సారి టెట్ రాసే అభ్యర్థుల నుండి సుమారుగా రూ.19 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలలో వెయిటేజీ లేకుండా కేవలం అర్హత పరీక్షలాగా నిర్వహిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో టెట్, డిఎస్‌సీ కలిపి నిర్వహిస్తున్నారు. గతంలో ఎస్‌జీ‌టీ పోస్టులలో బీఈడీ పూర్తి చేసినవారికి అవకాశం కల్పించలేదు.ఈ సారి అవకాశం కల్పించారు. దీనితో బీఈడీ విద్యార్థులు టెట్ పేపర్ 1 కూడా అధిక సంఖ్యలో అప్లయి చేసుకొన్నారు.

గతంలో నాలుగు లక్షల మంది అభ్యర్థులు టెట్ రాస్తే ఈసారి అదనంగా రెండు లక్షల మంది రాస్తున్నారు. మొన్నటి వరకు టెట్ టైమ్ వ్యాలిడిటీ ఏడు సంవత్సరాల ఉండేది. దీన్ని లైఫ్ టైంకు మార్చారు. ఇది మంచి నిర్ణయమే. టెట్ సిలబస్ కూడా అందరికి ఒకేలా ఉండటం కరెక్ట్ కాదు. భాషా పండిత అభ్యర్థులు కూడా మాథ్స్, సైన్స్ చదవాలనడం, టెట్ పేపర్-2 రాయాలనడం హేతుబద్ధత లేని నిర్ణయమే. బయలాజికల్ సైన్స్ విద్యార్థులకు మాథ్స్ సబ్జెక్ట్ 30 మార్కులు సిలబస్‌లో పెట్టడంతో అర్హులు కాలేకపోతున్నారు. మ్యాథ్స్ అభ్యర్థులతో పోటీ పడలేకపోతున్నారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది.

ఆర్‌ఎల్ మూర్తి

SFI రాష్ట్ర అధ్యక్షులు

82476 72658



Next Story

Most Viewed