- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
లాల్ బహుదూర్ శాస్త్రి మరణం వెనక మిస్టరీ!

ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిధిగా ఒప్పందాల మీద సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చరిత్రలో అంతకు ముందెప్పుడూ లేదు. ఈ మరణం హృద్రోగం వలన సంభవించిందని సోవియట్ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీనినే ధ్రువీకరించింది. శాస్త్రి బౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగంతోనే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన ఆఖరుగా తన కూతురితో సుమన్‌తో మాట్లాడారు. పాలుతాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్‌లైన్ డిస్కనెక్ట్ అయింది. దాదాపు 15 నిమిషాలకు పైగా సుమన్ లైన్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత లైన్ దొరికింది కానీ, శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్ తీసి 'మీ తండ్రిగారు మరణించారు' అని చెప్పాడు. ఎలాంటి ఆరోగ్యకర ఇబ్బందులు లేని శాస్త్రి 15 నిమిషాలలో మృతిచెందారని చెప్పడం మీద సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి.
భారతదేశ మలి ప్రధాని, స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై సందేహాలు తీరనే లేదు. అప్పటి రష్యా రాజధాని తాష్కెంట్‌లో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రకటించారు. కానీ, అది ప్రణాళికాపర హత్య అనే చర్చకు తెర లేపింది. 1965 ఆగస్టులో కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. తద్వారా కాశ్మీరు ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ, లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
భారత సైన్యం విజయానికి చేరువలో ఉండగా శాస్త్రిపై అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది. పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగ మంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. ఈ దశలోనే ఐక్యరాజ్య సమితి యుద్ధ విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనిని అంగీకరించాలని శాస్త్రి మీద తాష్కెంట్‌లో తీవ్ర ఒత్తిడులు వచ్చాయన్న ఆరోపణలున్నాయి. కాల్పుల విరమణ తరువాత శాస్త్రి, అయూబ్‌ఖాన్ తాష్కెంట్‌లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 1966 జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేసిన మరునాడే జనవరి 11న శాస్త్రి అక్కడే మృతి చెందారు.
చరిత్రలోనే తొలిసారి
ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిధిగా ఒప్పందాల మీద సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం చరిత్రలో అంతకు ముందెప్పుడూ లేదు. ఈ మరణం హృద్రోగం వలన సంభవించిందని సోవియట్ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీనినే ధ్రువీకరించింది. శాస్త్రి బౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగంతోనే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన ఆఖరుగా తన కూతురితో సుమన్‌తో మాట్లాడారు. పాలు తాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్‌లైన్ డిస్కనెక్ట్ అయింది. దాదాపు 15 నిమిషాలకు పైగా సుమన్ లైన్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత లైన్ దొరికింది కానీ, శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్ తీసి 'మీ తండ్రిగారు మరణించారు' అని చెప్పాడు. ఎలాంటి ఆరోగ్యకర ఇబ్బందులు లేని శాస్త్రి 15 నిమిషాలలో మృతిచెందారని చెప్పడం మీద సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి.
శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్ చుగ్ పక్కగదిలోనే ఉన్నా శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయం కనీసం ఆయనకు కూడా సోవియట్ అధికారులు వెల్లడించలేదు. మరణించిన తర్వాతే చెప్పారు. భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లను కూడా ఆయన భార్య లలితా శాస్త్రి గుర్తించారు. విషప్రయోగంతోనే శాస్త్రి మరణించారని ఆరోపించారు. శాస్త్రి కుమారుడు సునీల్ తండ్రి మరణానికి వెనుక ఉన్న కారణాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో 1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తునకు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు కారులో బయలుదేరిన డాక్టర్ చుగ్ లారీ ఢీకొని మరణించారు. శాస్త్రితోపాటు తాష్కెంట్‌కు వెళ్లిన వ్యక్తిగత సేవకుడు రామ్‌నాధ్‌ను కూడా కమిటీ వాంగ్మూలం నమోదుకు పిల్చింది. మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయటకేయగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్‌నాథ్ తీవ్రంగా గాయపడి గతాన్ని మర్చిపోయాడు.
ఇంతకీ ఏం జరిగింది?
'పాకిస్తాన్ భవిష్యత్తులో ఎప్పుడు కూడా భారత్‌పై బలగాలను ప్రయోగించరాదనే' వాగ్దానం చేయాలని శాస్త్రి రష్యాలో అయూబ్‌ఖాన్‌ను కోరారు. చర్చలు కొనసాగలేదు. తరువాత రోజే శాస్త్రి మరణించారు. భారత ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందించలేదు. మీడియా నిశ్శబ్దంగా ఉంది. భారతదేశంలో ఈ కుట్ర జరిగే సాధ్యాసాధ్యాలను 'ఔట్‌లుక్ మ్యాగజైన్' ప్రచురించింది. 2009లో 'దక్షిణాసియాపై సీఐఏ దృష్టి' పేరిట అనుజ్‌ధార్ అనే రచయిత పుస్తకం రాశారు. శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం క్రింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇవ్వడానికి పీఎమ్ఓ నిరాకరించింది. ఆ సమయంలో సీఐఏ డైరెక్టర్‌గా ఉన్న రోబర్డ్ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీడగ్లస్ అనే జర్నలిస్ట్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. శాస్త్రితో పాటు భారత్ అణు పితామహుడు డాక్టర్ హోమీబాబా మరణాలకు సీఐఏ ప్రణాళికలు రచించి అమలు చేసిందని వెల్లడించారు. తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని కోరాడు.
శాస్త్రి, హోమీబాబా మరణాలు ఒకే నెలలో జరిగాయి. రెండింటికి మధ్య రెండు వారాల వ్యవధే ఉంది. ఈ రెండూ దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. 60 వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతలను హతమార్చడం సీఐఏ పనిగా పెట్టుకుంది. దీనిపై కేంద్రం కేంద్రం నియమించిన రాజ్‌నారాయణ్ కమిటీ నివేదిక ఇప్పటికీ వెలుగు చూడలేదు. ఎక్కడా అందుబాటులోనూ లేదు. నిజాలు ఎప్పటికైనా వెలుగు చూస్తాయా?
(నేడు లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి)
రామకిష్టయ్య సంగనభట్ల
9440595494