రాజకీయాలు స్వార్థానికే..

by Disha edit |
రాజకీయాలు స్వార్థానికే..
X

ఏ పార్టీ అయినా సరే, పార్టీకి కార్యకర్తలే కీలకం. ప్రస్తుత పరిస్థితులలో కార్యకర్తల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. పార్టీ ప్రోగ్రాంలో బ్యానర్లు కట్టే మొదలు నుంచి నాయకుడు గెలుపోటములు నిర్ధారించే వరకు ప్రతి ప్రోగ్రాం విజయవంతం చేయడంలో కార్యకర్తల ముఖ్య భూమిక పోషిస్తారు. అలాంటి కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేసి నాయకులు గెలిచాక, నువ్వు ఎవరు నీ పేరేంటి అనే పరిస్థితులు కూడా కొందరు నాయకుల దగ్గర ఉన్నాయి.

గెలిచాక కార్యకర్తల్ని మర్చిపోయి..

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలను తమ స్వార్థానికి నాయకులు వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచాక ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ పార్టీలకు తమ ఆస్తులు కాపాడుకోవడానికే వాళ్ళు చేసిన అక్రమాలు బయట పడకుండా ఉండడానికి పార్టీలు మారుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు సైతం తమ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలుగా గెలిచిన కొత్త నాయకులకు పార్టీలోకి ఆహ్వానం పంపిస్తూ వారికే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కొందరు నాయకులు అయితే ఎన్నికల్లో పోటీకి ముందు వారు నమ్ముకున్న పార్టీ టికెట్ ఇవ్వకపోతే తమ స్వార్థం కోసం, టికెట్ కోసం పార్టీ మారుతూ మా నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మారుతున్నానని గప్పాలు కొట్టడం విడ్డూరం కలిగిస్తోంది. కింది స్థాయి కేడర్‌ని, కార్యకర్తలను పూర్తిగా తమ స్వలాభం కోసమే వాడుకుంటున్న కొందరు నాయకుల తీరు విచిత్రంగా ఉంది. లీడర్ కోసం కొన్ని సందర్భాల్లో తమ నాయకుడు గెలుపు కోసం కేసులు సైతం లెక్కచేయకుండా ఎన్నికల్లో పని చేస్తున్నారు. కానీ తీరా గెలిచాక ముఖం చాటేస్తూ అధికారంలో ఉన్న పార్టీలకు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు జంప్ అవుతున్నారు. నమ్ముకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే తమకి సర్పంచులుగా ఎంపీటీసీలుగా పోటీ చేసి గెలిచే అవకాశం ఉంటుందని తమ నాయకుడు గెలుపు కోసం డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు. తీరా గెలిచాక దీనికి మోహం చాటేస్తున్నారు.

పార్టీ మారితే శిక్షలు ఉండవా?

ఏదైనా ఒక పార్టీ గుర్తుతో గెలిచి వేరే పార్టీలోకి మారితే ఆ నాయకుడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోర్టులో కేసు వేయవచ్చు. పార్టీ ఉల్లంఘన క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా అలాంటి పనులు చేయకుండా వెళ్లే వాళ్ళు వెళ్ళనీ అని చేతులు దులుపుకుంటున్నారు.ఇలాంటి నాయకులకు జెండా పట్టేవాడి విలువ తెలియజేయాలన్నదే నా ఆశ.

సింగిరెడ్డి అశోక్ రెడ్డి

76618 01107



Next Story

Most Viewed