మా ఆవేదన పట్టదా మోడీజీ?

by Disha edit |
మా ఆవేదన పట్టదా మోడీజీ?
X

తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వంద రోజులలో ఎస్‌సీ వర్గీకరణ చేస్తామని చెప్పింది బీజేపీ. ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఈ అంశం కనీసం పార్లమెంటులో చర్చకు కూడా రాలేదు. రిజర్వేషన్లు జనాభా కు తగినట్టుగా అందకపోవడంతో మెజారిటీగా ఉన్న మాదిగలకు న్యాయం జరగడం లేదు. ఇప్పటికే షెడ్యూల్డ్ కులాలలో అనేక సంచార జాతులు అంతరించిపోయాయి. అయినప్పటికీ వారి ఆవేదనను మోడీ సర్కారు పట్టించుకోవడం లేదు. గతంలో రామచంద్రరాజు కమిషన్‌తో పాటు జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అధ్యయనం చేసి ఎస్‌సీ వర్గీకరణ అవసరమని చెప్పాయి. దీని వలన సామాజిక సమానత్వం పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశాయి.

కేంద్ర ప్రభుత్వం ఆడంబరంగా తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్‌టీ వసూలు, ఎల్ఐసీ సహా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంలాంటి పనుల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అగ్నిపథ్ పరిస్థితి అలాగే ఉన్నప్పటికీ, కేంద్రం దీనిని మంచి పథకమని సమర్థించుకుంటోంది. అగ్ని వీరుల గురించి మంత్రులు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు చూస్తేనే అర్థం అవుతుంది ఈ పథకం మీద వారికే ఎంత మేరకు అవగాహన ఉందో ! అలాగే, దేశాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామంటే భారత్ గొప్పగా మారుతుందని భావించాం పేదల ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని, నల్ల కుబేరులను, బ్యాంకులను దోచుకునేవారి పని పడతామని చెబితే నిజంగానే పేదల బతుకులు బాగుపడతాయని ఆశించాం. కానీ, అందుకు భిన్నంగానే గత ఎనిమిదేళ్లుగా మోడీజీ పాలన సాగుతోంది. బతుకులు మార్చే సంస్కరణలు కాకుండా, బతుకులు భారంగా మారే సంస్కరణలు రావడంతో దేశంలో యువత, బలహీనవర్గాల గుండెలు ఆవేదనతో నిండిపోతున్నాయి.

సామాజిక సమానత్వం కోసం

తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వంద రోజులలో ఎస్‌సీ వర్గీకరణ చేస్తామని చెప్పింది బీజేపీ. ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఈ అంశం కనీసం పార్లమెంటులో చర్చకు కూడా రాలేదు. రిజర్వేషన్లు జనాభాకు తగినట్టుగా అందకపోవడంతో మెజారిటీగా ఉన్న మాదిగలకు న్యాయం జరగడం లేదు. ఇప్పటికే షెడ్యూల్డ్ కులాలలో అనేక సంచార జాతులు అంతరించిపోయాయి. అయినప్పటికీ వారి ఆవేదనను మోడీ సర్కారు పట్టించుకోవడం లేదు. గతంలో రామచంద్రరాజు కమిషన్‌తో పాటు జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అధ్యయనం చేసి ఎస్‌సీ వర్గీకరణ అవసరమని చెప్పాయి. దీని వలన సామాజిక సమానత్వం పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశాయి.

ఎవరి నుంచి డిమాండ్ లేకపోయినా మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌కు పది శాతం రిజర్వేషన్ అందించింది. మేం దానినీ స్వాగతించాం. కానీ, దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఉన్న ఎస్‌సీ వర్గీకరణ డిమాండ్‌ను పట్టించుకోకపోవడం బాధాకరం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళితులు ఇంకా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. 75 శాతం మంది ఎస్‌సీ విద్యార్థులు ఈ దేశంలో పారిశుద్ధ్య కార్మికులుగానే ఉన్నారని ఇటీవల పార్లమెంటు సమావేశాల సాక్షిగానే వెల్లడయ్యింది. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు, గిరిజనులకు కూడా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది.

అవి ఆదర్శంగా నిలిచాయి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలపై ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ, తెలంగాణలో మాత్రం గొప్ప గొప్ప సంస్కరణలు అమలులోకి వచ్చాయి. అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి జోన్లు, మల్టీ జోన్లుగా విభజన చేసి స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కల్పించారు. దీని ఆధారంగా నేడు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ పూరించలేదు.

తెలంగాణ రాష్ట్రములోని ప్రజల జీవన, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ ముందుకెళ్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే, కేంద్రం తీసుకొస్తున్న బలవంతపు సంస్కరణలతో ప్రజలకు ఉపయోగం లేకుండాపోతోంది. వారి వ్యంగ్యపు మాటలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ప్రధాని హోదాలో ఇక్కడికి వస్తున్న మోడీజీ తెలంగాణ సబ్బండ వర్గాల బాధలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

కామారెడ్డి, 78933 03516



Next Story

Most Viewed