ఆస్ట్రేలియాలో అంతా మనవారే?

by Disha edit |
ఆస్ట్రేలియాలో అంతా మనవారే?
X

ఆస్ట్రేలియాలో మన భారతీయులు సుమారు 7,83,958 ఉండగా, వారిలో 88 శాతం 'వర్కింగ్ ఏజ్ గ్రూప్' శ్రామిక జనాభా గలవారే. వీరిలో 66 శాతం ఫుల్ టైం జాబ్ హోల్డర్స్ గా, 27 శాతం పార్ట్ టైం జాబ్ హోల్డర్స్‌గా ఉపాధి పొందుతున్నారు. 12 బిలియన్ అమెరికన్ డాలర్లు పన్ను చెల్లిస్తూ బ్రిటన్ వలసదారుల కంటే మన భారతీయ వలసదారులు ముందు వరుసలో ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆర్థికాభివృద్ధిలో వెన్నుముకగా ఉన్నారు. చైనా, న్యూజిలాండ్ బోర్న్ ఇమిగ్రెంట్స్ కంటే భారతీయ వలసదారులే అధికంగా ఉన్నారు.‌ 1996-2006 మధ్య కాలంతో పోలిస్తే, 2006-2020 కాలంలో వీరి సంఖ్య డబుల్ అయ్యింది. 'ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ఎఫైర్స్' వారు సౌత్ ఆసియాలో గ్లోబల్ టాలెంట్ పెరుగుతోందని వెల్లడించారు. దీనిలో భారతీయులే అగ్రస్థానంలో ఉండడం ఆనందకరమైన విషయం.‌

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందినవారే అన్ని రంగాలలో ప్రధాన భాగస్వామ్యం కలిగి ఉన్నారు. వారే ఆస్ట్రేలియా ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్లు నడిపే డ్రైవర్ల నుంచి కార్పొరేట్ కంపెనీల సీఈఓల వరకూ మన భారతీయులే అంటే ఆశ్చర్యం కలుగుతుంది.‌ రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ నామమాత్రంగా ఉండే భారతీయుల సంఖ్య ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పరిణామాలతో వేగంగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో చదువుకున్న యువత, ముఖ్యంగా సాంకేతిక విద్య అభ్యసించిన యువత అవకాశాలు వెతుక్కుంటూ ఇతర దేశాలకు తరలిపోతున్నారు. వివిధ రకాల అవకాశాలను అందిపుచ్చుకుని వివిధ స్థాయిలలో రాణించి వారితో పాటు ఆయా దేశాల ఆర్థిక, రాజకీయ సామాజిక వ్యవస్థలో కీలక భూమిక పోషించుట జరుగుతోంది.‌ దీనిలో భాగంగానే వ్యాపారం, ఉద్యోగాలు, రాజకీయ, న్యాయ, విద్య, సైన్స్ అండ్ ఆర్ట్స్, ఇంజనీరింగ్ వంటి విభాగాలలో, రంగాలలో వివిధ రకాలుగా భాగస్వామ్యం అయ్యారు.‌

'ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఏబీఎస్)' నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుల సంఖ్య 7,83,958. అనగా ఆస్ట్రేలియా జనాభాలో 3.1 శాతంగా ఉన్నారు.‌ అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఇన్‌కం టాక్స్ వంటి పన్నులు చెల్లించేదారులుగా రెండవ స్థానంలో ఉన్నారు. 'ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్ అండ్ ట్రేడ్' నివేదికలో 'ఆస్ట్రేలియాకు భారతీయులు ఒక సంపద' అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఆర్థికాభివృద్ధిలోకీలక పాత్ర పోషిస్తున్నారు అని కూడా వివరించారు. ఇదే సమయంలో భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు అన్ని రకాలుగా బలపడడం శుభపరిణామం. మరెన్నో అవకాశాలకు ఇది ఉపయోగకరం

దాదాపు అన్ని రంగాలలో

ఆస్ట్రేలియా జనాభా ప్రతి నలుగురులో ఒకరు విదేశీయులే.‌ భారతీయులే ఆస్ట్రేలియా భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ముఖ్యంగా విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్ ఆస్ట్రేలియా వంటి రాష్ట్రాలు, ప్రాంతాలలో భారతీయులే అనేక రంగాలలో దిక్సూచిగా ఉండుట గమనార్హం.‌ 'డీఎఫ్ఏటీ' రిపోర్ట్ ప్రకారం ఆస్ట్రేలియాలో భారతీయులు విద్యారంగం, పెరుగుతున్న జనాభాకు నూతన ఆవిష్కరణలు కనుగొనుట, వ్యాపారం, సర్వీసు అండ్ సైన్స్ విభాగాలు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత విభాగాలలో (ఎస్‌టీఈఎమ్ రంగాలు) మంచి ప్రతిభ కనపరుస్తున్నారు.‌ దీంతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం, పెట్టుబడుల వరుసలో ముందంజలో ఉంటున్నది. 2021 'ఆర్బిస్' రిపోర్ట్ ప్రకారం 2,840 మంది అనగా 13 శాతం భారత సంతతి వారే 996 ఆస్ట్రేలియా సంస్థలలో డైరెక్టర్లుగా, మేనేజేర్లుగా పనిచేస్తున్నారు.ది. వీరిలో 12.5 శాతం మంది మహిళలే.

ఈ 2,840 మంది అతి ముఖ్యమైన వ్యాపారం, ఆరోగ్యం, పర్యాటకం, ఐసీటీ వంటి కంపెనీలలో పనిచేస్తున్నారు. సుమారు 250 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యాపారం వీరు చేస్తుంటారు. అయితే, విద్యా, వ్యవసాయ రంగాలలో తక్కువగా ఉన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతో ఈ రంగాలలో కూడా మార్పులు రాబోతున్నాయి. మన భారతీయులు ఆ మార్పులను అందిపుచ్చుకొని ముందుకు సాగాలి. ఇక భారత విద్యార్థులు విదేశీ విద్యార్థులు కంటే ఎక్కువ నైపుణ్యాలు కలిగిన వారిగా 2019-20 గణాంకాలలో తేలింది. ముఖ్యంగా విద్యా రంగంలో అధ్యాపకులుగా 2016లో 1.75 శాతం మంది ఉండగా, 2020 నాటికి 1.92 శాతం పెరిగారు.

Also read: ప్రపంచాన నావిక్ సత్తా చాటాలి

పన్ను చెల్లింపులోనూ ముందంజ

ఆస్ట్రేలియాలో మన భారతీయులు సుమారు 7,83,958 ఉండగా, వారిలో 88 శాతం 'వర్కింగ్ ఏజ్ గ్రూప్' శ్రామిక జనాభా గలవారే. వీరిలో 66 శాతం ఫుల్ టైం జాబ్ హోల్డర్స్ గా, 27 శాతం పార్ట్ టైం జాబ్ హోల్డర్స్‌గా ఉపాధి పొందుతున్నారు. 12 బిలియన్ అమెరికన్ డాలర్లు పన్ను చెల్లిస్తూ బ్రిటన్ వలసదారుల కంటే మన భారతీయ వలసదారులు ముందు వరుసలో ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆర్థికాభివృద్ధిలో వెన్నుముకగా ఉన్నారు. చైనా, న్యూజిలాండ్ బోర్న్ ఇమిగ్రెంట్స్ కంటే భారతీయ వలసదారులే అధికంగా ఉన్నారు.‌ 1996-2006 మధ్య కాలంతో పోలిస్తే, 2006-2020 కాలంలో వీరి సంఖ్య డబుల్ అయ్యింది.

'ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ఎఫైర్స్' వారు సౌత్ ఆసియాలో గ్లోబల్ టాలెంట్ పెరుగుతోందని వెల్లడించారు. దీనిలో భారతీయులే అగ్రస్థానంలో ఉండడం ఆనందకరమైన విషయం.‌ చరిత్ర పుటలు తిరగేస్తే, సుమారు 4,230 సంవత్సరాల క్రితం నుంచే భారత్- ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా 'టూల్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్' రంగాలలో ఇరు దేశాలకు సంబంధాలు ఉన్నాయి. 4000 సంవత్సరాల క్రితమే, ఆస్ట్రేలియా ఇండియాకు స్వస్థలం గా భావించేవారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో భారత్-ఆస్ట్రేలియా కలిసి పనిచేసి, వివిధ రంగాలలో అభివృద్ధి సాధించుటకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆశిద్దాం.


ఐ.ప్రసాదరావు

63056 82733



Next Story

Most Viewed