అమెరికాలో తెలుగును బతికిస్తున్న సిలికానాంధ్ర

by Disha edit |
అమెరికాలో తెలుగును బతికిస్తున్న సిలికానాంధ్ర
X

మన బడిని స్థాపించే ముందు సిలికానాంధ్ర నిర్వాహకులు అనేక మంది నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించారు. పలు సమావేశాలు నిర్వహించారు. ఒక ప్రణాళిక, విధానం నిర్ణయించారు. అమెరికాలోని తెలుగు పిల్లల భాషా పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుని పాఠ్య పుస్తకాలను రూపొందించారు. ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందుకు 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం' సహకారం తీసుకున్నారు. పాఠ్య పుస్తకాలను యథావిధిగా కొనసాగించకుండా విద్యార్థుల, ఉపాధ్యాయులు, ఇతర నిపుణుల సూచనలకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇందులో రెండు వేల మందికి పైగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. అమెరికాలో 250 'మన బడి' కేంద్రాలు ఉన్నాయి. 65 వేల మంది విద్యార్దులకు పాఠాలు బోధించారు.

సిలికానాంధ్ర' తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ 23 సంవత్సరాలుగా అమెరికాలో పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రవాస తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ప్రాచీన తెలుగు భాషను వివిధ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలలో సజీవంగా ఉ౦చేందుకు 2007లో సిలికానాంధ్ర సంస్థ 'మన బడి' అనే కొత్త సంస్థను నెలకొల్పింది. కాలిఫోర్నియాలో ప్రారంభమైన 'మనబడి' అనతి కాలంలోనే అమెరికాలోని అనేక నగరాలకు వ్యాపించింది. వారాంతంలో తెలుగు పిల్లలకు తెలుగు భాషలో చదవడం, రాయడం నేర్పించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలలో ఒకటి.

మాతృభాషలో చదవడం, రాయడం, వినడం, నేర్చుకోవడం చాలా సులభం. బాలబాలికల వికాసం మాతృభాష ద్వారానే వేగంగా జరుగుతుంది. ఉపాధి కోసం సుమారు వంద సంవత్సరాల నుంచే అమెరికాకు వలస వచ్చిన వేలాది తెలుగు కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ తెలుగు భాషకు అంత ప్రాధాన్యం లేదు. ఎందుకంటే, పలు దేశాల ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. తెలుగు ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ అధికార భాష ఆంగ్లం. విద్యార్థులకు ఇంగ్లిషులోనే బోధన జరుగుతుంది. మూడవ భాషగా జర్మన్, మరి కొన్ని విదేశీ భాషలను మాత్రమే అమెరికా ప్రభుత్వం గుర్తించింది.

నిపుణుల సూచనలతో

మన బడిని స్థాపించే ముందు సిలికానాంధ్ర నిర్వాహకులు అనేక మంది నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించారు. పలు సమావేశాలు నిర్వహించారు. ఒక ప్రణాళిక, విధానం నిర్ణయించారు. అమెరికాలోని తెలుగు పిల్లల భాషా పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుని పాఠ్య పుస్తకాలను రూపొందించారు. ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందుకు 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం' సహకారం తీసుకున్నారు. పాఠ్య పుస్తకాలను యథావిధిగా కొనసాగించకుండా విద్యార్థుల, ఉపాధ్యాయులు, ఇతర నిపుణుల సూచనలకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇందులో రెండు వేల మందికి పైగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. అమెరికాలో 250 'మన బడి' కేంద్రాలు ఉన్నాయి. 65 వేల మంది విద్యార్థులకు పాఠాలు బోధించారు.

ఇతర దేశాలలో మరో పది కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దీనికి అధ్యక్షులుగా, డీన్‌గా చామర్తి రాజు వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా భాషా వ్యాప్తికి పలు ఉప విభాగాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క విభాగానికి ఒక్కో బాధ్యుడిని నియమించారు. అన్ని కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నడిపిస్తున్నారు. అంతర్జాల సమావేశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. 'మన బడి'ని ఏడు భాగాలుగా విభజించారు. 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 'బాలబడి'గా నిర్ధయించారు. ఇక ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసనం తరగతులలో 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశాలు కల్పించారు. 'మన బడి'కి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గుర్తింపు లభించింది. కొవిడ్‌ కారణంగా కొంత వెనకబడినప్పటికీ ప్రస్తుతం మళ్లీ పుంజుకుంది.

తగిన వనరులు లేకున్నా

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 'మన బడి'ని ముందుకు తీసుకు వెళుతున్నారు. తగినన్ని వనరులు లేకున్నా, అననుకూల పరిస్థితులలో, ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి 'మన బడి'ని విజయవంతంగా నడుపుతున్న నిర్వాహకులు అభినందనీయులు. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కంటే ఇతర రాష్ట్రాలు, దేశాలలో నివసించే తెలుగు ప్రజలకు భాషాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఉపాధి కోసం, జీవన మనుగడ కోసం మాతృభూమిని వదిలి ఇతర ప్రదేశాలలో నివసిస్తున్నప్పటికీ వారి భాషా మూలాలను, ప్రాముఖ్యతను మరువలేదు. 2008 నుంచి 2012 వరకు ఒక తెలుగు దిన పత్రికకు ముంబై మహానగరంలో న్యూస్‌ బ్యూరో ఇన్‌చార్జీగా పని చేశాను.

ఆ సమయంలో కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు భాషాభిమానం ప్రదర్శించారు. ముఖ్యంగా ముంబైలోని దాదార్‌లో గల ఆంధ్ర మహాసభ తెలుగు ప్రజల కార్యక్రమాలకు కేంద్రంగా పని చేస్తోంది. ఇప్పటికీ ప్రతివారం సాహితీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల ముఖ్య నగరాలన్నింటిలోనూ తెలుగు సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంఘాల ప్రతినిధులు ప్రతి రెండేండ్లకోసారి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశం కానీ దేశంలో పది మంది తెలుగు ప్రజలు ఒక చోట చేరినా సంబరంగానే ఉంటుంది.


జి గంగాధర్‌ సిర్ప

అమెరికా

90103 30529


Next Story

Most Viewed