- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుస్తకాల కొరత లేకుండా చూడండి
పుస్తకాల కొరత లేకుండా చూడండి... governament should provide acadamic books for competitive exams

తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇదివరకే చాలా నోటిఫికేషన్స్ జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్టు కోసం తెలుగు అకాడమీ పుస్తకాలు కావాలి. తెలుగు అకాడమీ పుస్తకాలను టీఎస్‌పీఎస్‌సీ ప్రామాణికంగా తీసుకుంటుంది. కానీ తెలుగు అకాడమీలో పుస్తకాల కొరత చాలా ఉంది. కాబట్టి ప్రభుత్వం, తెలుగు అకాడమీ సంచాలకులు తెలుగు అకాడమీలో పుస్తకాల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తున్న తరుణంలో అదేవిధంగా పుస్తకాల కొరత లేకుండా చూడాలని కోరుతున్నాం. తెలుగు అకాడమీలో పుస్తకాలు అందుబాటులో ఉండేటట్లు చూడాలి. వివిధ గ్రామాల నుండి తెలుగు అకాడమీకి వచ్చి పుస్తకాలను కొనుగోలు చేద్దాం అంటే పుస్తకాల కొరత ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. నిరుద్యోగులు ప్రైవేటు పుస్తకాలను కొనలేని పరిస్థితిలో ఉన్నందున తెలుగు అకాడమీలో అన్ని పుస్తకాలను అందుబాటులో ఉండేటట్టు చూడాలని కోరుతున్నాం. నిరుద్యోగులకు కాకుండా చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అకాడమీ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం.
దేవులపల్లి రమేశ్
99637 01294






