ప్రమాదంలో Chandrababu Naidu భద్రత

by Disha edit |
ప్రమాదంలో Chandrababu Naidu భద్రత
X

ప్రమాదంలో చంద్రబాబు భద్రతనున్న ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఏపీలోని అధికార పక్షంలో కనిపిస్తోంది. నిరంకుశత్వం, అరాచకం, దాడులే ఆయుధంగా అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై దాడులకు తెగబడుతోంది అధికార పార్టీ వైసీపీ. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి రాష్ట్రంలో నిత్యం ఎన్ఎస్‌జి కమెండోల రక్షణలో వున్నచంద్రబాబుపై జరుగుతున్న దాడులే నిదర్శనం. రాష్ట్రంలో హింసకు తావు లేకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పర్యటన కొనసాగించేలా తోడ్పాటు అందించడం, రక్షణ కల్పించడం పోలీసులు బాధ్యత. కానీ జగన్ పాలనలో చంద్రబాబు భద్రత ఆందోళనకరంగా తయారైంది. ఆయన పర్యటనలు అడ్డుకోవడం, రాళ్ళ దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం వంటి వికృతాలు తారాస్థాయికి చేరాయి. ఇది ప్రజాస్వామ్యమో, రాచరికమో అర్థం కావడం లేదు.

నిర్లక్ష్యంగా ఏపీ పోలీసులు..

గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఈ విధమైన కక్ష సాధింపులతో, పగ, ప్రతీకారంతో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ... ప్రతిపక్ష నాయకుడిపై ఈ విధంగా రాళ్ల దాడులు చేయించలేదు. తప్పుడు కేసులు పెట్టలేదు. నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అధికారం పక్షం నాయకులు, కార్యకర్తలు క్రూరంగా దాడులకు దిగుతున్నా అరాచకంగా వ్యవహరిస్తున్నా పోలీసులది ప్రేక్షక పాత్రే. పోలీసులు వైసీపీ పెంపుడు మనుషులుగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఆయనపై జరుగుతున్న రాళ్ల దాడులను చూస్తే చంద్రబాబు భద్రత ప్రమాదంలో పడిందని అర్ధం అవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీలో మరింత అసహనం పెరిగి చంద్రబాబు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని తట్టుకోలేక ఆయనపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. చంద్రబాబుకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం. రానున్న రోజుల్లో చంద్రబాబు లక్ష్యంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులను తొలగించి చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించి ఆయన భద్రతకు మొత్తం కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, అసమర్ధతను, విధ్వంసాన్ని వివరించి ప్రజలను చైతన్యం చేయడానికి ప్రజాక్షేత్రంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతారు. ఆయనకు భద్రత కల్పించాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు పర్యటనలను అడుగడుగునా అడ్డుకొంటూ దాడులకు దిగే ప్రమాదం వున్నది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఎక్కడికి వెళ్లినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లదాడి చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు జరిగిన రాళ్ళ దాడుల్లో ఎన్ఎస్‌జీ కమెండోలు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి ఆయనను రక్షించడం జరిగింది. చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అనేక సంఘటనల ద్వారా రుజువయింది. చంద్రబాబు కాన్వాయ్‌‌పై రాళ్లు వేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా? దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా, ఎన్ఎస్‌జీ భద్రత వున్న చంద్రబాబు పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?

ప్రజల దృష్టి మళ్లించేందుకు..

ఎన్ఎస్‌జీ భద్రతలో, ప్రజల, పోలీసుల మధ్య వున్నప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పైనే హత్యాయత్నం చేసిన వైసీపీ నాయకులే చంద్రబాబు హత్యాయత్నం చేశారని కేసు పెట్టారు అంటే రాష్ట్రంలో ఎంత అరాచక, నియంతృత్వ, అద్వాన పాలన సాగుతుందో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబుకు రక్షణ కల్పించవలసిన పోలీసులు చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టడానికి సిగ్గు పడాలి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని తమ అధికారంతో అణచివేసి తప్పుడు కేసులు పెట్టి, లొంగ తీసుకొని రాజకీయంగా బలపడాలి అనుకోవడం అనైతికం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మేలు కొరకు వినియోగించకుండా ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి,అణగ తొక్కడానికి, ప్రతిపక్ష నాయకుడిని అంతం చేయడానికి ఉపయోగించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా తన పరిపాలన పట్ల పెరుగుతున్న వ్యతిరేకత పట్ల జగన్ కళ్ళల్లో, ఆయన శిబిరంలో కలవరం మొదలైంది. తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడుతున్నారన్నవిషయం గ్రహించిన జగన్‌లో అక్కసు, అసహనం పెరిగిపోతున్నాయి. నిరాశ, నిస్పృహ అలుముకుంటున్నాయి. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రజల కళ్ళకు గంతలు కట్టేందుకు తన కార్యకర్తలను ఉసిగొల్పి వారితో రాళ్ళ దాడి చేయించి, వారితోనే పోలీసులకు ఫిర్యాదు చేయించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై తప్పుడు కేసులు పెడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు పైనే రాళ్లు రువ్వి హత్యాప్రయత్నం చేసి తిరిగి ఆయన పైనే హత్యాయత్నం నేరం మోపడం జగన్ కుట్ర రాజకీయాలకు పరాకాష్ట.

ఏదీ నిరూపించలేకపోయారు!

ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్న చంద్రబాబుపై కేసు నమోదు చేయడం దుర్మార్గం. ఏమిటి ఆయన చేసిన నేరం? ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, దోపిడీ, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలదీసే బాధ్యత చంద్రబాబుకు లేదా అంగళ్లు ప్రాంతంలో నగరి, హంద్రీనీవా రెండు ప్రాజెక్టుల్లో రూ.5వేల కోట్ల స్కాం జరిగింది. భూ సేకరణ, అర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీల్లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. ఆ స్కాంను చంద్రబాబు బయటపెట్టడానికి తట్టుకోలేని మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు చంద్రబాబుపై రాళ్ల దాడికి పాల్పడి హత్యాయత్నం చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టడం జగన్ రెడ్డి కుటుంబానికి అలవాటుగా మారింది. అవినీతి నిరోధక శాఖ కోర్టు నుంచి, సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసులు,సభా సంఘాలు వేసి ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడా ఆరోపణలు రుజువు చెయ్యలేక పోయారు. తమ తప్పులు ఎత్తి చూపిన, వైఫల్యాలను ఎండగట్టిన వారిపై దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టి శిక్ష విధించాలని చూస్తున్నారు. నియంతలు పాలకులు అయితే పరిపాలన ఇలానే వుంటుంది.ఫాసిస్టు పాలనలో జరుగుతున్న అవినీతిని,అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సింది నవ్యాంధ్ర సమాజమే.

నీరుకొండ ప్రసాద్

98496 25610



Next Story

Most Viewed