అమెజాన్ ఇండియా సీఈఓకు ఈడీ సమన్లు!

by  |
amazon
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందంలో విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అమెజాన్ ఇండియా సీఈఓ అమిత్ అగర్వాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీనికి సంబంధించి వచ్చే వారంలో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

అమెజాన్ కంపెనీ 2019లో రూ. 1,400 కోట్ల విలువైన ఒప్పందంతో ఫ్యూచర్ రిటైల్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం అమలులో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్టు గతంలో అమెజాన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసింది. ఇప్పటికే ఈ రెండు సంస్థల కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల దీనిపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌తో ఫ్యూచర్ రిటైల్ వాటాదారుల ఒప్పందంతో పాటు అమెజాన్‌తో ఫ్యూచర్ కూపన్ షేర్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ఫ్యూచర్ కూపన్స్ ఒప్పందాలను కోర్టు పరిశీలించింది.

ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెజాన్ సంస్థ ఫ్యూచర్ రిటైల్‌పై నియంత్రణాధికారం సాధించినట్టు అర్థమవుతోందని తెలిపింది. ఇది విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టంతో పాటు ఎఫ్‌డీఐ నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుందని ఈడీ భావిస్తోంది. సమన్లకు సంబంధించి అమెజాన్ అధికార ప్రతినిధి స్పష్టత ఇచ్చారు. సమన్లు ఇప్పుడే అందాయని, దాన్ని పరిశీలించిన తర్వాత గడువులోపు స్పందిస్తామని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.


Next Story

Most Viewed