Etela Nithin Reddy: ఈటల కొడుకు ‘నితిన్’ రెడ్డి భూ కబ్జాపై విచారణ షురూ..

by  |
Etela Nithin Reddy: ఈటల కొడుకు ‘నితిన్’ రెడ్డి భూ కబ్జాపై విచారణ షురూ..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డి భూ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈటల నితిన్ రెడ్డి భూకబ్జా ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని శనివారం సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.

మేడ్చల్ మండలం, రవల్‌కోల్ గ్రామంలో సర్వే నెంబర్ 77లో 10.11 ఎకరాల తమ భూమిని కబ్జా చేశారని పిట్ల మహేష్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్‌‌ను కలిశాడు. దీంతో సీఎం విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో రెవెన్యూ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. బాధితుడు మహేష్‌ను కార్యాలయానికి పిలిచి ఆయన వద్ద భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.



Next Story

Most Viewed