యాక్షన్ ప్లాన్‌పై ఈటల మౌనం…

by  |
యాక్షన్ ప్లాన్‌పై ఈటల మౌనం…
X

దిశ, హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు నిరాకరించారు. సోమవారం హైదరాబాద్ నుండి హుజురాబాద్ కు వచ్చిన ఈటల రాజేందర్‌కు పట్ణణంలో ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు అండగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. కాట్రపల్లి, హుజురాబాద్‌లో ఆడబిడ్డలు తనను ఆశీర్వదించారన్నారు. కమలాపూర్, హుజురాబాద్ నియెజకవర్గాల నుండి పోటీ చేసిన తనకు ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారన్నారు. అడగడుగునా తన కోసం ఎదురు చూస్తున్న జనం ఆదరణను మర్చిపోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. అయితే మీ యాక్షన్ ప్లాన్ ఏంటీ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మాత్రం ఈటల మౌనంగా ఉండిపోయారు. మధ్యాహ్నం శామీర్‌పేటలోని తన నివాసం నుండి బయలుదేరిన రాజేందర్ సిద్దిపేట, హుస్నాబాద్ మీదుగా హుజురాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ కు చేరుకుని బాబాసాహెబ్ విగ్రహానికి పూల మాల వేశారు. అక్కడి నుండి నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు.

భారీగా చేరిన శ్రేణులు…

మంత్రివర్గం నుండి ఉద్వాసన పలికిన తరువాత మొదటి సారిగా హుజురాబాద్‌కు చేరుకున్న ఈటల రాజేందర్‌కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక మంగళ హారుతలతో స్వాగతం చెప్పారు. నియోజకవర్గంతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా ఈటల అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ డౌన్ డౌన్, కాబోయే సీఎం ఈటల అంటూ అభిమానులు నినాదాలు చేశారు.



Next Story

Most Viewed