విశాఖలో పెద్ద శబ్దాలతో భూప్రకంపనలు

371

దిశ, విశాఖపట్నం: విశాఖ మన్యం సీలేరులో శనివారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు.. బయటికి పరుగులు తీశారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో సీలేరులో భూమి కంపించింది. అదే సమయంలో పెద్దగా శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందా అని అనుకునేలోపే ప్రకంపనలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సీలేరులోని జెన్కో అపార్ట్మెంట్ల వద్ద ప్రకంపనల శబ్దాలు పెద్దగా వినిపించాయి. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సీలేరులో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగడంతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఇదే ట్రోల్‌ అవ్వడం విశేషం.