ఈ-ఓటింగ్.. ఖమ్మం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు

by  |
ఈ-ఓటింగ్..  ఖమ్మం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచం మొత్తం డిజిటల్ కార్యకలాపాల్లోకి దూసుకెళ్లినా.. కోవిడ్ -19 మహమ్మారిని పరిగణనలోకి తీసుకుని దేశంలోనే తెలంగాణలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఈ-ఓటింగ్ పరిష్కారాన్ని అభివృద్ధి చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా ఐటీ పరిశ్రమలశాఖ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ అమలు మద్దతితో ఈ చొరవ చూపారు. తెలంగాణ, సాంకేతిక అభివృద్ధి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ద్వారా అభివృద్ధి చేశారు.

వికలాంగులు (పీడబ్ల్యూడీ), సీనియర్ సిటీజన్లు, నోటిఫైడ్ ఎసెన్షియల్ సర్వీసుల్లో పనిచేసే పౌరులు, జబ్బుపడిన వ్యక్తులు, పోలింగ్ సిబ్బంది, ఐటీ ప్రొఫెషనల్ మొదలైన ఓటర్లలో కొన్ని వర్గాలకు ‘ఈ-ఓటింగ్’ సదుపాయాన్ని కల్పించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక నుంచి ఈ చొరవ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో 8 నుంచి 18 అక్టోబర్ వరకు దరఖాస్తుపై నమోదు, అక్టోబర్ 20న డమ్మీ ఓటింగ్‌తో డమ్మీ ఎన్నికల రూపంలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్ అనేవి ఇప్పటికే వివిధ గవర్నమెంట్ ప్రాజెక్టులను శక్తివంతం చేసే అత్యంత బహుముఖ సాంకేతికతలు అన్నారు.


Next Story

Most Viewed