ఫ్రీగా డబ్బులు ఇస్తాం.. తీసుకోండి! కస్టమర్లకు బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థల ఆఫర్

by  |
BNPL
X

దిశ, వెబ్‌డెస్క్: కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థలు కొత్త పద్ధతిని అవలంభిస్తున్నాయి. అదే BNPL ( బై నౌ పే లేటర్).. అంటే ఏదైనా వస్తువును ముందు కొనుగోలు చేసి తర్వాత డబ్బులు చెల్లించే పద్ధతి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇటీవల కాలంలో ఇ-కామర్స్ సంస్థలు, ఫిన్‌టెక్ ప్లేయర్‌లు, బ్యాంకులు BNPL సౌకర్యాన్ని అందించడం ప్రారంభించాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి బ్యాంకుల మాదిరిగానే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ విధమైన చెల్లింపును అందిస్తున్నాయి. PayTM, PhonePe, LazyPay వంటి అనేక యాప్-ఆధారిత ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లు BNPL లోన్ లను అందిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో గాడ్జెట్‌ల నుండి విస్తృత-శ్రేణి వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ విధమైన పద్దతిని ఎంపిక చేసుకుంటున్నారు.

ప్రస్తుతం రెండు రకాల BNPL (బై నౌ పే లేటర్) ఆప్షన్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి వడ్డీ రహిత ఎంపిక. రెండవది కొంత మొత్తాన్ని వడ్డీగా చెల్లించవలసి ఉంటుంది. రెండవ రకంలో వడ్డీ మొత్తాన్ని చిన్న చిన్న వాయిదాలుగా విభజించబడుతుంది. ఇది వినియోగదారునికి కొంత భారాన్ని తగ్గిస్తుంది. BNPL ఎంపికలో ముఖ్యమైనది బ్యాంక్ క్రెడిట్ స్కోర్‌. ఇంతకుముందు ఉన్న లోన్‌లను సకాలంలో తిరిగి చెల్లిస్తే, క్రెడిట్ స్కోర్‌ సానుకూలంగా ఉండి BNPL సౌకర్యాన్ని తొందరగా పొందవచ్చు.

భారతదేశంలో ఈ-కామర్స్ ఆన్‌లైన్ చెల్లింపుల పద్దతి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. మొబైల్ కొనుగోలు, కొత్త దుస్తుల కోసం షాపింగ్ చేయడం వంటి అన్ని వర్గాల ద్వారా వినియోగదారులకు BNPL సేవలు అందిస్తున్నారు. గ్లోబల్ పేమెంట్స్ రిపోర్ట్ ప్రకారం, 2024 నాటికి మొత్తం ఈ-కామర్స్ ,మార్కెట్ షేర్‌లో 9% BNPL ఉంటుందని అంచనా. BNPLకు వినియోగదారుల నుండి అధిక స్పందన వస్తుండటంతో ఈ-కామర్స్ రంగం ఊపందుకుంది. మార్కెట్ల నుండి డిమాండ్ పెరగడం వలన అన్ని నగరాలకు ఈ రకమైన సేవలను విస్తరించాలని అన్ని రంగాల వారిని లక్ష్యంగా చేసుకొని ఈ-కామర్స్ సంస్థలు కార్యాచరణ ప్రారంభిస్తున్నాయి.

పాయల్ రాజ్‌పుత్ బ్రా లెస్ షో.. వీడియో వైరల్


Next Story

Most Viewed