దుష్యంత్ ‘కరోనా’ దుమారం

by  |
దుష్యంత్ ‘కరోనా’ దుమారం
X

న్యూఢిల్లీ : రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ కదలికల చుట్టూ కరోనా భయం ముసురుకున్నది. కరోనావైరస్ పాజిటివ్‌గా తేలిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పాల్గొన్న ఓ పార్టీలో దుష్యంత్ కూడా హాజరవ్వడం.. తర్వాత అనేక మంది ఎంపీలను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా కేంద్రమంత్రులను కలుసుకోవడం ఇప్పుడు కేంద్ర నాయకుల్లో భయాందోళనలు కలిగిస్తున్నది. ఎంపీలు, కేంద్ర మంత్రుల్లో కరోనా భయం రాజ్యమేలుతున్నది. కాగా, వైరస్ వ్యాప్తి కట్టడిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్ని అపాయింట్‌మెంట్‌లను రద్దు చేశారు.

యూకే వెళ్లొచ్చిన కనికా కపూర్ హాజరైన పార్టీకి వసుంధర రాజె సహా దుష్యంత్ సింగ్‌కూడా గత ఆదివారం వెళ్లారు. కనికా కపూర్‌కు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో.. వీరిరువురూ సెల్ఫ్ క్వారంటైన్‌‌ను ఆచరిస్తున్నారు. అయితే, మూడు రోజుల కింద రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో దుష్యంత్ సింగ్ పాల్గొన్నారు. ఈ పార్టీలో అనేక మంది ఎంపీలు, కేంద్ర మంత్రులూ పాల్గొనడం ఇప్పుడు కలవరపెడుతున్న వార్త. ఆ విందులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా యూపీ, రాజస్తాన్‌లకు చెందిన ఎంపీలతో దుష్యంత్ కలిశారు. అదే బ్రేక్‌ఫాస్ట్‌లో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, బీజేపీ ఎంపీ హేమా మాలినీ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కాంగ్రెస్ నేత కుమారి సెల్జా, బాక్సర్, ఎంపీ మేరీ కోమ్‌లూ పాల్గొన్నారు.

మూడు రోజుల క్రితం ట్రాన్స్‌పోర్ట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో దుష్యంత్‌ సింగ్‌తో రెండున్నర గంటలు కలిసి ఉన్నారని చెబుతూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒ బ్రియన్ స్వచ్ఛంద ఏకాంతవాసంలోకి వెళ్లారు. ఆప్ నేత సంజయ్ సింగ్, కాంగ్రెస్ నేతలు దీపెందర్ హుడా, జితిన్ ప్రసాదలూ సెల్ఫ్ క్వారంటైన్‌‌లోకి వెళ్లారు. అలాగే, లక్నోలో నిర్వహించిన ఓ పార్టీకి హాజరైన దుష్యంత్ సింగ్‌‌ను కలిసిన ప్రతిఒక్కరిని ఆరోగ్య శాఖ ట్రాక్ చేసే పనిలో పడింది. కాగా, ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న దుష్యంత్ సింగ్‌పై కరోనా పరీక్షలు నిర్వహించలేదు. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు నిర్వహిస్తామన్న వైద్యుడి సలహా మేరకు ఇంకా పరీక్షలు చేయించుకోలేదు. ఇప్పుడు ఆ పరీక్షల కోసం ఆయనతో కలిసిన నేతలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tags: mp dushyanth singh, coronavirus, rajasthan, president, self quarantine, panic, spread, MP’s, central ministries


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed