డ్రోన్స్‌తో కందిరీగ గూళ్లు ధ్వంసం

by vinod kumar |
డ్రోన్స్‌తో కందిరీగ గూళ్లు ధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్ : డ్రోన్స్ అంటే ఒకప్పుడు మిలిటరీ వాళ్లే యూజ్ చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రతీచోట ఉపయోగిస్తున్నారు. పెళ్లిళ్లు, మీటింగ్స్, పొలిటికల్ సభలను అబ్జర్వ్ చేసేందుకు కూడా వాడుతున్నారు. అయితే జాంగ్ అనే దేశంలో మాత్రం ఇంకాస్త వినూత్నంగా.. మానవాళికి హాని కలిగించే కందిరీగ గూళ్లను ధ్వంసం చేసేందుకు డ్రోన్లను వాడారు. వారు అలా ఎందుకు చేశారంటే..

చాంగ్‌కింగ్ సిటీ పరిసర ప్రాంతంలోని చెట్లపై కొలువుదీరిన కందిరీగలు.. అక్కడ స్థానికంగా నివసించే తెగల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అవి ఒక్కసారి కుట్టాయంటే చాలు.. మూత్రపిండాలు, లివర్‌తో పాటు గుండెకు ఎఫెక్ట్ ఏర్పడి రెండు గంటల్లోనే మరణించే చాన్సెస్ ఉంటాయని చెంగ్‌డు మిలిటరీ హాస్పిటల్ నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ గుఓ డాంగ్‌యాంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ కందిరీగల గూళ్లు ధ్వంసం చేసేందుకు చైనాకు చెందిన మానవతా సంస్థ బ్లూ స్కై రెస్క్యూ ఓ టీమ్‌గా ఏర్పడింది. కందిరీగలను ధ్వంసం చేసేందుకు రూ.9 లక్షల విరాళాలు సేకరించి వాటి ద్వారా డ్రోన్లకు గ్యాస్ ట్యాంక్‌లు అమర్చింది. అలా డ్రోన్‌లకు పెద్ద పెద్ద నాజిల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా చెట్లపై ఉన్న గూళ్లను ధ్వంసం చేశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.



Next Story

Most Viewed