కరోనాను కట్టడి చేయడానికి సాక్షాత్తు దేవుళ్లే దిగి వచ్చారుగా..

by  |
కరోనాను కట్టడి చేయడానికి సాక్షాత్తు దేవుళ్లే దిగి వచ్చారుగా..
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. మహమ్మారి దాటికి దేశంలో ఒక్కరోజే 2 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. కేసులూ 3 లక్షలకు అత్యంత చేరువలో ఉన్నాయి. అయినా కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా, సామజిక దూరం పాటించకుండా కరోనాతో చెలగాటం ఆడుతున్నారు. కరోనాపై ఎంతోమంది అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి బాధ్యత గల పౌరులు తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ముగ్గురు యువకులు విన్నూత రీతిలో కరోనా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఓ హోటల్‌లో పనిచేసే అభిషేక్‌, నవీన్‌, భాష అనే ముగ్గురు వ్యక్తులు నేడు శ్రీరామనవమి పండగ సందర్భంగా శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, హనుమంతుడు వేషధారణలో వెళ్లి మాస్క్ లు పెట్టుకొనివారికి మాస్క్ లను అందించారు. మాస్క్ పెట్టుకోకపోతే అందరం దేవుడి దగ్గరకే వెళ్తామని దేవుడి రూపంలోనే వచ్చి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దేవుడే వచ్చి చెప్తున్నాడు.. మాస్క్ పెట్టుకోండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Next Story

Most Viewed