వ్యాక్సిన్ ప్రయోగాలకై డా. రెడ్డీస్ కీలక ఒప్పందం 

by  |
వ్యాక్సిన్ ప్రయోగాలకై డా. రెడ్డీస్ కీలక ఒప్పందం 
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ క్లినికల్ పరీక్ష ప్రక్రియను వేగవంతం చేయడానికి దేశీయ దిగ్గజ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ సిద్ధమవుతోంది. దీనికోసం బయో టెక్నాలైఇ మంత్రిత్వ శాఖకు చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్(బీఐఆర్ఏసీ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది.

ఈ భాగస్వామ్యం ప్రకారం.. వ్యాక్సిన్ ప్రయోగాల్లో బీఐఆర్ఏసీ సూచనలతో పాటు వ్యాక్సిన్ ప్రయోగాలను డాక్టర్ రెడ్డీస్ వినియోగించుకోవడానికి అవకాశముంటుంది. కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా. వేణు స్వరూప్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను వ్యాక్సిన్ కంపెనీలకు అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

‘స్పుత్నిక్-వి వ్యాక్సిన్ పరీక్షల ట్రయల్స్ కోసం సలహాదారుగా ప్రభుత్వ విభాగం బీఐఆర్ఏసీతో భాగస్వామ్యం కుదరడం ఆనందంగా ఉంది. ఇది భారత్‌కు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే ప్రక్రియ వేగానికి సాయమందించడం. బయోటెక్నాలజీ విభాగంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని డా.రెడ్డీస్ లేబోరేటరీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డీ స్పందించారు.


Next Story

Most Viewed