తల్లికి కరోనా ఉన్నా బిడ్డకు పాలివ్వొచ్చు !

by  |
తల్లికి కరోనా ఉన్నా బిడ్డకు పాలివ్వొచ్చు !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రసవం తర్వాత తల్లికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినా బిడ్డకు పాలు ఇవ్వొచ్చని తిరుపతి రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి అన్నారు. గురువారం టీటీడీ మహిళా ఉద్యోగులకు ఆన్‌లైన్ ద్వారా కరోనాపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గర్భిణిలకు జలుబు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలన్నారు. గర్భిణికి 8లేదా 9వ నెలలో కరోనా వస్తే బిడ్డకు ఇబ్బంది ఉండదన్నారు. ప్రసవం తర్వాత శిశవుకు కరోనా పరీక్షలు చేయించాలన్నారు. చేతులు సబ్బుతో కడుక్కొని, మాస్కు పెట్టుకొని బిడ్డకు పాలివ్వాలన్నారు. గర్భవతులు వేడినీరు బాగా తాగాలని సూచించారు. అల్లం, బెల్లం, మిరియాలు ఉడికించిన కషాయం రోజుకోసారి 50మిల్లీ లీటరు తాగితే మంచిదని, సి విటమిన్, బి కాంప్లెక్స్, జింక్ మాత్రలు డాక్టర్ సూచన మేరకు రోజూ తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రావు, ఏఈఓ శ్రీమతి జగదీశ్వరి పాల్గొన్నారు.



Next Story

Most Viewed