ప్రజలకు ఇచ్చే వాగ్ధానాలు ఇవేనా..? సీఎం హామీలపై డాక్టర్లు ఫైర్..!

by  |
super specialty hospital
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి జిల్లాకో సూపర్​స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చి ఏడేళ్లు పూర్తవుతున్నా, ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో ఏకంగా టీఆర్ఎస్​మ్యానిఫెస్టోలో పొందుపరిచినా ఆ హామీని నెరవేర్చ లేక పోయారు. తద్వారా గ్రామాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో చాలా మంది పేషెంట్లు హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఈక్రమంలో సకాలంలో వైద్యం అందక ఎంతో మంది పేషెంట్లు మరణిస్తున్నారు.

జిల్లా ఆసుపత్రులు ఉన్నా, వాటిలో అరకొర సేవలు అందుతున్నాయి. మెషిన్లు ఉంటే డాక్టర్లు ఉండరు, సౌకర్యాలు ఉంటే సిబ్బంది కొరత వేధిస్తున్నది. కరోనా సమయంలో ఆయా ఆసుపత్రుల పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా తయారైంది. అందుబాటులో ఉన్న సిబ్బంది కరోనా సేవల్లో నిమగ్నం కాగా, మిగత రోగాలను పట్టించుకునే వారు కరవయ్యారు. దీంతో అత్యవసర పేషెంట్లు నరకయాతన పడుతున్నారు. మరోవైపు పాత హామీలే నెరవేర్చకపోగా, ప్రతీ సారి మళ్లీ కొత్తవి ప్రకటిస్తున్న సీఎంపై ప్రజలతో పాటు డాక్టర్లు మండిపడుతున్నారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు ఇలాంటి హామీలను ఇస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిమ్స్​ తరహా ఏమైంది సారు?

2014 సాధారణ ఎన్నికల సమయంలో ఉన్న పది జిల్లాలతో పాటు కొత్తగా మరో 14 జిల్లాలను ఏర్పాటు చేసి 24 సూపర్​స్పెషాలిటీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తామని టీఆర్ఎస్​ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. జిల్లా కేంద్రాల్లో నిమ్స్​తరహాలో దవాఖాన్లను ఏర్పాటు చేసి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. వీటిని ఏర్పాటు చేయడం వలన ప్రతీ 60 కిలోమీటర్లకు ఒక సూపర్​ స్పెషాలిటీ అందుబాటులోకి వస్తుందని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేషెంట్లకు ఇబ్బందులు తప్పుతాయని సీఎం కేసీఆర్ అప్పటి ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రస్తావించారు. కానీ వాటిలో ఇప్పటికీ ఒక్కటి కూడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

మరోవైపు ఇటీవల నగరం నలుమూలల నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తామని మరో హామీ ఇచ్చారు. అయితే వీటి ఏర్పాటుకు అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నా, అధికారికంగా మాత్రం జీవో రాలేదు. అయితే గతంలో ఇచ్చిన హామీలను కప్పిపెట్టేందుకు సీఎం ప్రతీ సారి కొత్త హామీలను ఇస్తున్నారని ప్రతిపక్షనాయకులు మండిపడుతున్నారు.

అప్పట్లో ఇచ్చిన మరి కొన్ని హామీలు..

అన్ని మండల కేంద్రాల్లో నలుగురు ఎంబీబీఎస్​డాక్టర్లతో 30 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు సేవలందిస్తామన్నారు. కానీ వీటిలో కొన్ని మాత్రమే ఏర్పాటయ్యారు. వాటిలో కూడా 24 గంటల పాటు వైద్యం అందదు. మరి కొన్నింటిని కేవలం నర్సులతో నెట్టుకొస్తున్నారు. దీంతో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి వంద పడకల ఏరియా ఆసుపత్రి అని చెప్పినా, అవి కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని పీఎంపీ, ఆర్ఎంపీలకు తగిన శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లను అందిస్తామన్నారు. అదీ నెరవేర్చలేదు.

108,104ను మరింత బలోపేతం చేస్తామని టీఆర్ఎస్​పార్టీ పేర్కొన్నది. కానీ టీఆర్ఎస్​ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 104 పూర్తిగా విఫలం కాగా, 108 సేవలు మందగించాయి. సరైన వాహనాలు, సిబ్బంది లేక అస్తవ్యస్తంగా మారాయి. దీంతో పాటు అన్ని జిల్లాల్లో ఫోరెనిక్స్​మెడిసిన్​స్పెషలిస్టులను నియమిస్తామని చెప్పినా, కేవలం పది జిల్లాలకు మాత్రమే ఉన్నట్లు ఆఫీసర్లు ఆఫ్​ది రికార్డులో చెబుతున్నారు.


Next Story

Most Viewed