కొవిడ్ 19 చెకప్‌కు వెళ్లిన వైద్యులు, పోలీసులపై దాడి

by  |
కొవిడ్ 19 చెకప్‌కు వెళ్లిన వైద్యులు, పోలీసులపై దాడి
X

భోపాల్ : కరోనావైరస్‌ అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్న వైద్యులు, పోలీసులపై దాడులు ఆగడం లేదు. తాజాగా, మధ్యప్రదేశ్‌లో కొవిడ్ 19 చెకప్ డ్రైవ్‌కు వెళ్లిన వైద్యులు, పోలీసులపై కొందరు స్థానికులు దాడికి పాల్పడ్డారు. షియోపుర్ జిల్లా గస్వానీ గ్రామంలో ఈ దాడి జరిగింది. శివహరే అనే వ్యక్తి ఇటీవలే ఇండోర్ నుంచి ఈ గ్రామానికి వచ్చాడు. చెకప్ డ్రైవ్‌లో భాగంగా ఈ వ్యక్తిని పరీక్షించేందుకు పోలీసులు, వైద్యులు వెళ్లారు. కాగా, స్థానికులు వీరిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏఎస్ఐ శ్రీరాం అవస్థీ గాయపడ్డారు. దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులపై కేంద్రం స్పందించి.. బుధవారం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ నేరాన్ని నాన్‌బెయిలబుల్‌గా పరిగణించి.. గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా ఎపిడెమిక్ చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.

Tags: coronavirus, madhya pradesh, covid 19, attack, doctors, police, local, injured

Next Story

Most Viewed