ఈ 9 రోజులు ఇటువైపు రాకండి.. పోలీసులు కీలక ఆదేశాలు

by  |
Khairathabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఖైరతాబాద్‌లో ఈ నెల 19వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల పెద్ద సంఖ్యలో రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని, మెట్రో, ఎంఎంటీఎస్‌లో రావాలని సూచించారు. ఖైరతాబాద్​కు వచ్చే వాహనాల కోసం హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ అనుమతిచ్చినట్లు వెల్లడించారు. వృద్ధులు, నడవలేని వారి వాహనాలకు మింట్ కాంపౌండ్ లో పార్కింగ్ కు అనుమతిచ్చారు. ఖైరతాబాద్ ప్రధాన రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల మాత్రమే అనుమతిస్తున్నారు. తొలి రోజు నుంచే భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఖైరతాబాద్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 19 వరకు ఖైరతాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు కొనసాగించనున్నట్లు పోలీసులు ప్రకటించారు.


Next Story

Most Viewed