అక్కినేని హీరోలకు పెళ్లిళ్లు అచ్చిరావడంలేదా.. అందరిది అదే తీరు ?

by  |
అక్కినేని హీరోలకు పెళ్లిళ్లు అచ్చిరావడంలేదా.. అందరిది అదే తీరు ?
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలం నుంచి అభిమానులు ఎదైతే జరగకూడదు అనుకుంటున్నారో.. చివరికి అదే జరిగింది. ఏమాయ చేసావే అనే సినిమాతో ఒకటైన ఈ జంట నాలుగేళ్లలో ఎంతో అన్యోన్యంగా ఉండి మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వీరు విడాకులు తీసుకోవడంతో అక్కినేని అభిమానులు బాధ అంతా ఇంతా కాదు. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు పెళ్లిళ్లు కలసిరావడం లేదా.. అనే ప్రశ్న అభిమానుల మెదళ్లను తొలుస్తుంది. నాగార్జున నుంచి నాగచైతన్య , అఖిల్ వరకు అందరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

నాగార్జున అక్కినేని 1984 లో డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు, కాని అతను 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. నాగ చైతన్య అమ్మ లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమ వివాహాం చేసుకున్నాడు. నాగార్జున ఆయన మొదటి భార్య లక్ష్మి ఇద్దరి ఇష్టాలతో విడాకులు తీసుకున్నారు.

అక్కినేని నాగార్జున మేనల్లుడు సమంత్ కూడా ప్రేమ వివాహం చేసుకొని చిన్న చిన్న కారణాల వలన విడిపోయారు. తొలి ప్రేమ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కీర్తి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎంతోకాలం నిల‌వ‌లేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు క‌లిసి ఉండలేక‌పోయారు.

అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌ది కూడా ఇదే పరిస్థితి అని చెప్పవచ్చు. సిసింద్రీ సినిమాతో ఎంతో మంది మదిలో నిలిచిపోయాడు అఖిల్. దీంతో అఖిల్‌కి పెళ్లి వయసువచ్చాక అందరి కళ్లు తన మీదనే పడ్డాయి. ఎట్టకేలకు ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్‌ తో ప్రేమలో ఉన్నాడని తెలిసింది. కొన్నిరోజులకే వీరిద్దరు ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక అంతంలోనే ఏం జరిగిందో తెలియదు కానీ కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా అక్కినేని అఖిల్ విడాకులు తీసుకున్నాడు.

ఇక ఏడేళ్లుగా ప్రేమించుకొని సమంత-నాగచైతన్య ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి జంటను చూసి టాలీవుడ్ లో కుల్లుకున్న మనుషులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అక్టోబరు 7, 2017లో వివాహ బంధంతో ఒక్కటైంది ఈ జంట. మనసులు కలిస్తే చాలు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కలిసి జీవించాలనే కోరిక బలంగా ఉంటే ఒకటి కాకుండా ఉండలేమని నిరూపించారు. చివరికి ఎవరూ ఊహించని విధంగా అభిమానులకు షాకిచ్చారు. ఏమాయ చేసావే సినిమాలో ‘పై లోకంలో వాడు ఎపుడో ముడివేశాడు..’ ఇక విడిపోనే.. విడి పోదూ.. అనే పాటను విన్న ప్రతిసారి వీరు కూడా అలానే ఉండిపోవాలి అనుకున్న అభిమానుల ఆశలు అడియాశలు చేసి చివరకు విడాకులు తీసుకున్నారు.

Next Story

Most Viewed