హైదరాబాద్‌లో 26 నుంచి డబుల్ ఇళ్ల పంపిణీ

by  |
Double bedroom house
X

దిశ, సిటీ బ్యూరో : నగరంలో సొంతిల్లు లేని పేదల కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కదులుతోంది. మహానగరం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నిర్మాణ పనులు పూర్తయిన దాదాపు 592 డబుల్ ఇళ్లను శనివారం ఉదయం మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ. 58.50 కోట్లతో నిర్మాణం పూర్తయిన 592 ఇళ్లలో కొన్నింటిని శనివారం, మరి కొన్నింటిని ఈ నెల 28న పంపిణీ చేయనున్నారు.

రెండు ప్రాంతాల్లో ఇంకా పనులు తుది దశలో ఉన్న 192 ఇళ్లను వచ్చే నెల 1, 3వ తేదీల్లో పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం 784 ఇళ్లను సుమారు రూ. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రాంగోపాల్ పేట డివిజన్ లోని అంబేద్కర్ నగర్ రూ.28,5 కోట్ల వ్యయంతో నిర్మించిన 330 ఇళ్లను నేడు లబ్ధిదారులకు అందించనున్నారు. దీంతో పాటు పొట్టి శ్రీరాములునగర్ లో రూ. 14.01 కోట్ల వ్యయంతో నిర్మించిన 162 ఇళ్లను కూడా పేదలకు పంపిణీ చేయనున్నారు. బీవై రెడ్డి కాలనీలో రూ.15.57 కోట్లతో నిర్మించిన 180 ఇళ్లను వచ్చే నెల 1వ తేదీన, అలాగే గొల్ల కొమరయ్య కాలనీలో రూ. 85 లక్షలతో నిర్మించిన 12 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వచ్చే నెల 5న అందించనున్నారు.

ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, గృహా నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి హాజరై పేదలకు ఇళ్లను అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం రూ. 9714 కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు.



Next Story

Most Viewed