బైక్‌పై ప్రేమికుల రొమాంటిక్ స్టంట్.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్పీ.. ఫైన్ చూస్తే షాక్!

by Ramesh N |
బైక్‌పై ప్రేమికుల రొమాంటిక్ స్టంట్.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్పీ.. ఫైన్ చూస్తే షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ప్రేమ జంట బైక్ పై రొమాంటిక్ స్టంట్స చేస్తూ ఏకంగా ఎస్పీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జాష్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాష్‌పూర్‌ జిల్లా ఎస్పీ శశిమోహన్‌ సింగ్‌ ఓ పనిమీద కుంకురికి వెళ్లి తిరిగి జాష్‌పూర్‌కు వస్తున్నారు. ఈ క్రమంలోనే కట్నీ-గుమ్లా జాతీయ రహదారిపై ఓ ప్రేమ జంట బైకుపై రొమాంటిక్స్ స్టంట్స్‌ చేయడం ఆయన కంటబడింది. వెంటనే ఎస్పీ తన కెమెరాలో వారి స్టంట్ వీడియో తీస్తూ వారిని ఫాలో అయ్యారు. తర్వాత ఆ జంటను అడ్డుకోని చలానా వేయించారు. మరోసారి ఇలాంటి స్టంట్స్‌ చేయవద్దని హెచ్చరించి పంపారు.

అయితే, బైక్ పై స్టంట్ వేసిన వినయ్‌, సుహానా అనే జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. వీరిద్దరూ స్థానిక మాయాలి డ్యామ్‌ను సందర్శించేందుకు వచ్చారు. తిరిగి వస్తుండగా, గర్ల్ ఫ్రెండ్ సినిమా స్టైల్‌లో పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని స్టంట్ చేద్దామని అడిగిందంట. దీంతో ప్రియుడు వినయ్ సాయి రొమాంటిక్ స్టంట్ వేసి.. చివరికి ఎస్పీ దొరికిపోయారు. ఎస్పీ స్థానిక స్టేషన్ పోలీసులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత మోటారు వాహన చట్టం కింద స్థానిక పోలీసులు రూ.500 జరిమానా వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం రూ. 500 ఫైన్ వేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed