టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం

by  |

దిశ, పాలేరు: నియోజకవర్గంలోని కూసుమంచి తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి ,టీఆర్ఎస్ మండల కమిటీల ప్రకటన, గ్రామ కమిటీల ప్రకటన కోసం గురువారం ఎమ్మెల్యే కందాల క్యాంపు కార్యాలయంలో తెరాస నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మండల కమిటీలు ప్రకటించక ముందే గ్రామ కమిటీలకు సంబంధించిన గ్రామాల పేర్లు ప్రకటించాలనే ఉద్దేశంతో నాలుగు గ్రామాలను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో అందులో రాజుపేట గ్రామం పేరు ప్రకటించాలని డీసీసీబీ డైరెక్టర్ చేగొమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ తో కూసుమంచి సొసైటీ చైర్మన్ వాసం శెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి లేని సమయంలో వెల్లడించవద్దని అన్నారు. దీంతో వాసం శెట్టి వెంకటేశ్వర్లు ,ఇంటూరి శేఖర్ కు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో మండల కమిటీల, గ్రామ కమిటీల ప్రకటన వాయిదా పడింది. తెరాస పెద్దలు బాలకృష్ణారెడ్డి ,బెల్లం వేణు, ఎంపీపీ ,శ్రీనివాస్ నాయక్ ఏఎంసీ, చైర్మన్ సేటtrs, రామ్ నాయక్ ,తెరాస మండల అధ్యక్షులు, పరశురాం, వెంకన్న తదితరులు ఇరువురిని శాంతింపజేశారు.

Next Story

Most Viewed