టాప్స్ నుంచి తొలగింపు.. పారా షట్లర్ ఆవేదన

by  |
టాప్స్ నుంచి తొలగింపు.. పారా షట్లర్ ఆవేదన
X

దిశ, స్పోర్ట్స్ : ఒలంపిక్స్‌కు సన్నద్దం అయ్యే క్రీడాకారులకు చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఒలంపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)ను ప్రవేశపెట్టింది. టాప్స్ ద్వారా ఆయా క్రీడాకారులకు ఆర్థిక సహాయంతో పాటు ఇతర సదుపాయాలు అందుతాయి. తాజాగా ఆ జాబితా నుంచి పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ సుకాంత్ కదమ్‌ను తొలగించారు. కేంద్ర క్రీడాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సుకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ నెంబర్ 5 పారా షట్లర్ అయిన తనను ‘సరైన కారణం’ చూపకుండా తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. 2018 ఆసియన్ పారా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన కదమ్.. ఈ సారి పారా ఒలంపిక్స్‌లో పతకం సాధించాలని సాధన చేస్తున్నాడు. ఈ మేరకు కదమ్ గురువారం ట్విట్టర్ వేదికగా కేంద్ర క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజిజుకి తన బాధను తెలియపరిచాడు. ‘కిరణ్ రిజిజు సార్, తనను టాప్స్ నుంచి తొలగించడం నన్ను అసంతృప్తికి గురి చేసింది. ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా నన్ను తొలగించారు. పారా ఒలంపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో మంచి ప్రదర్శన చేస్తున్న నన్ను ఇలా చేయడం భావ్యం కాదు’ అని పేర్కొన్నాడు.



Next Story

Most Viewed