అత్యవసర ఫిర్యాదులకు ‘డయల్ 112’.. దేశ వ్యాప్తంగా ఒక్కటే నంబర్

by  |
call-center
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశం వ్యాప్తంగా ఒక్కటే నెంబర్.. అత్యవసర సమయాల్లో ఫిర్యాదులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నెంబర్ ఉంది. దాంతో ప్రజలు గంధర గోళానికి గురయ్యేవారు. ఇకనుంచి ఆ ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్రం కొత్త చర్యలు చేపడుతోంది. డయల్ 100 స్థానంలో 112 తీసుకొచ్చేందుకు నిర్ణయించడంతో పాటు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. పోలీసుశాఖ ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. త్వరలోనే డయల్112 పూర్తిగా అందుబాటులోకి రానుంది. డయల్ 100 కాల్ చేసినా 112 కు వెళ్లేలా అనుసంధానం చేస్తున్నారు.

అత్యవసర సమయాల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే నెంబర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ప్రజలు కాల్ చేసే డయల్ 100 స్థానంలో డయల్ 112 ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల వరకు డయల్ 100 అందుబాటులో ఉండనుందని, 100 కు పోన్ చేసినా 112 కు వెళ్లేలా చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు అధికారులు, కంట్రోల్ రూంలో పనిచేసేవారికి నేర్పించాలని రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయించింది. సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలకు అర్ధమయ్యే విధంగా ప్రచార చిత్రాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది.

police

వందల మంది ఒకేసారి ఫోన్ చేసినా స్వీకరించేలా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు. కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్లకార్డులతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం పంపిన ప్రపొజల్స్ ను రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపింది. కానీ ఎప్పటి నుంచి రాష్ట్రంలో అమలులోకి వచ్చేది, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి వాటిపై పోలీసుశాఖ నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు.

ప్రపోజల్స్ వచ్చాయి..
డయల్ 112పై ప్రభుత్వం నుంచి ప్రపోజల్స్ వచ్చాయి. కానీ ఎప్పటి నుంచి అమలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాల కల్పనపై స్పష్టమైన ఆదేశాలు రాలేదు. దీంతో ప్రస్తుతం అత్యవసర సమయంలో డయల్ 100 కు ప్రజలు కాల్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత డయల్ 112పై విస్తృతంగా ప్రచారం చేస్తాం. 100 కు ఫోన్ చేసినా 112కు వెళ్లేలా సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తున్నాం.



Next Story

Most Viewed