టీఆర్ఎస్ సర్కార్‌కు SFI స్ట్రాంగ్ వార్నింగ్

by  |
టీఆర్ఎస్ సర్కార్‌కు SFI స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, పరకాల: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దొంగ హామీలతో విద్యార్థులను మోసం చేశారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మంద శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అలాగే పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ అక్షరాల 3850 కోట్లు మూడు సంవత్సరాలవి పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రారంభించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఎస్ ఎం హెచ్ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలన్నారు . ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొజ్జ హేమంత్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed