వాళ్లు చదువు మధ్యలో ఆపేయడానికి కారణం ఇదే.. ఏబీవీపీ క్లారిటీ

by  |
ABVP Protest
X

దిశ, జనగామ: పన్నెండు వందలమంది విద్యార్థుల ఆత్మబలిదానాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యకు డబ్బులు కేటాయించకపోవడం దారుణమని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని జనగామ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ… రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్నారని తెలిపారు. గత రెండేండ్ల నుంచి పూర్తి స్థాయిలో స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేసి కూలీ పనులకు వెళ్లా్ల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

ఇప్పటికైనా.. ప్రభుత్వం స్పందించి పెండింగ్ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ బకాయిలు విడుదల కాకపోవడంతో కీలకమైన కళాశాలలు సైతం మూసివేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని, లేకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కరరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed