నేడు హనుమాన్ జయంతి.. ఈ పనులు చేస్తే ఎల్లప్పుడూ అనుగ్రహం వీరి సొంతం..

by Disha Web Desk 10 |
నేడు హనుమాన్ జయంతి.. ఈ పనులు చేస్తే ఎల్లప్పుడూ అనుగ్రహం వీరి సొంతం..
X

దిశ, ఫీచర్స్ : హనుమాన్ జయంతి పండుగను చైత్ర శుద్ధ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ముఖ్యంగా హనుమాన్ ఆలయంలో ఈ రోజున ధ్వజస్తంభంపై కాషాయ జెండాను పెట్టాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే మన జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. మనం చేసుకున్న కర్మలు గాలిలో ధూళిలా మనలోంచి కొట్టుకుపోతాయని అంటున్నారు. ఈ రోజున ఈ పనులు చేస్తే ఎల్లప్పుడూ అనుగ్రహం వారిపై ఉంటుందని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఆంజనేయుడికి తమలపాకులు నైవేద్యంగా పెట్టాలి. ఒకప్పుడు సీతమ్మ భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటుందని చెబుతారు. సీతమ్మ నాలుక ఎర్రగా మారుతుంది. ఎందుకని హనుమంతుడు అడిగితే రామయ్య అంటే చాలా ఇష్టమని చెప్పిందట. ఇక అప్పటి నుంచి హనుమంతుడు కూడా తమలపాకులను ప్రేమించడం మొదలు పెట్టాడు.

హనుమంతుడికి తెల్లని జిల్లెడు పువ్వులంటే చాలా ఇష్టం. అందుచేత హనుమాన్ జయంతి రోజున ఈ పూల మాలలు సమర్పించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ప్రతి శని, మంగళవారాల్లో జిల్లేడుకు పూలు సమర్పించాలని నిపుణులు చెబుతున్నారు.

రావి ఆకులపై గంధంతో శ్రీరామ నామాన్ని రాసి ఆంజనేయునికి మాల వేయండి. రామనామం రాసిన వారి ఇంట్లో సిరి సంపదలకు ఎప్పటికీ లోటు ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే ఈరోజు చాలా మంది ఆకులపై గంధంతో శ్రీరామ నామాలు రాస్తుంటారు.



Next Story

Most Viewed