చేసిన పాపం పోయినట్లుగా సర్టిఫికేట్‌ ఇచ్చే ఆలయం.. ఎక్కడుందో తెలుసా?

by Disha Web Desk 6 |
చేసిన పాపం పోయినట్లుగా సర్టిఫికేట్‌ ఇచ్చే ఆలయం.. ఎక్కడుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది పలు తప్పులు చేస్తూ క్షమించమని కోరుకునేందుకు ఆలయానికి వెళ్తుంటారు. కొన్ని ఆలయాలకు భక్తులు భారీగా తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంటుందని అందరికీ తెలిసిందే. కొందరు దేవుడిని విపరీతంగా నమ్ముతూ నిత్యం పూజలు, ఉపవాసాలు పాటిస్తుంటారు. కొన్ని ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తే.. కోరికలు నెరవేరుతాయని ఎంత దూరమైనా సరే వెళ్తుంటారు. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తారు. అలాగే సిద్ధాంతులు చెప్పే పరిహారాలను కోసం తెగ డబ్బు వెచ్చిస్తారు. కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తారు. ఇదిలా ఉంటే.. ఓ ప్రాంతంలో పాపం పోగొట్టుకున్నట్లుగా సర్టిఫికెట్ ఇచ్చే ఆలయం ఉందట. ఈ విషయం తెలిసిన వారంతా ఇలాంటి ఆలయాలు కూడా ఉంటాయా? అని షాక్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇదేనట. దీనిని గిరిజనుల హరిద్వార్‌ అని కూడా పిలుస్తారట. ఈ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉంది. దీన్ని గౌతమేశ్వర మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు. ఇక్కడ మందాకిని పాప మోచిని గంగా కుండ్‌ అనే రిజర్వాయర్‌ ఉంది. దీనిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తులు నమ్ముతుంటారు. ఈ గుడిలో కేవలం రూ. 12 చెల్లించి వాటర్ ట్యాంక్‌లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం ఇస్తారు. ఈ మేరకు ఆలయ పూజారి మాట్లాడుతూ.. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. వారందరికీ పాప విమోచర ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు. ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాకా పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందట. ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్లు అక్కడి దేవాలయం అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, కేవలం పాపం పోగొట్టుకోవడం కోసమే గాక పూజలు కూడా నిర్వహిస్తుంటారని తెలిపారు.

Next Story

Most Viewed